Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట లైట్లు ఆఫ్ చేసాక వరుణ్, వితిక అదట.. జ్యోతక్క కథా కమామీషు (Video)

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (16:12 IST)
ఇటీవల మంచి టిఆర్‌పీలతో ముందుకు సాగుతున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' మొదట్లో అంత ఇంట్రస్టింగ్‌గా లేకపోయినప్పటికీ రాన్రానూ మజాగా సాగుతోంది. దీనికి తోడు నాగార్జున హోస్టింగ్ చేస్తున్న ఈ షోలో ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి.

తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ కోసం ఈ వారం త్యాగాల టాస్క్ ఇవ్వగా, అందరూ పోటీపడి మరీ త్యాగం చేసారు. ఇక అదయ్యాక బుధవారం ఎపిసోడ్‌లో చెప్పుకున్న గాసిప్‌లు వేరే రేంజ్‌లో ఉన్నాయి.
 
బిగ్ బాస్ కాలేజ్ అనే వెరైటీ టాస్క్ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అంతా రెచ్చిపోయి పెర్ఫార్మ్ చేసి, తమలోని టాలెంట్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో బుధవారం ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. బాబా భాస్కర్ హర్ట్ చేశాడని ఏడ్చిన శివజ్యోతి ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఇందులో వితిగా క్రేజీ టీజర్‌గా పెర్ఫార్మ్ చేయగా, విద్యార్థిగా శివజ్యోతి పెర్ఫార్మ్ చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో గాసిప్ అంటే ఏంటని శివజ్యోతిని అడగగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది శివజ్యోతి.
 
గాసిప్ అంటే అంటూ పుకార్లు అని చెప్పిన శివజ్యోతి.. అవేంటో చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ గాసిప్‌లో మిమ్మల్ని వాడుకుంటా ఏం అనుకోవద్దు అని పేర్కొంటూ.. ''వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ హౌస్‌లో రాత్రి లైట్లు బంద్ అయ్యాక లోపల ఏమోనట!, వితిక, వరుణ్‌‌ని బాగా డబ్బులున్నాయనే పెళ్లి చేసుకుందట'' అంటూ చెప్పగా ఆశ్చర్యపోయిన వితిక తెల్లముఖం వేసింది.
 
ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగియగా తొమ్మిదో వారం ఎలిమినేషన్‌ లిస్ట్‌లో మహేష్, రాహుల్, హిమజ ముగ్గురూ నామినేట్ అయ్యారు. ఈ వారం ఈ ముగ్గురులో ఎవరు బిగ్ బాస్ హౌస్‌ నుండి ఎలిమినేట్ కానున్నారనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డు ప్రహరీ గోడపై చిరుతపులి పరుగులు (video)

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. సీఎం రేవంత్ రాజకీయ క్రీడలో భాగమంటున్న కవిత

వైఎస్ఆర్ కడప జిల్లా బాగానే వుంది, ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అయితే బహుబాగు: వైఎస్ షర్మిల

Roja: చంద్రబాబు అధికారంలోకి వచ్చింది అప్పులు, అరచకాలకు పెంచడానికే: రోజా

మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

తర్వాతి కథనం
Show comments