Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్విట్టర్ ట్రెండింగ్‌లో #Vanitha.. అసలు ఎవరామె?

Advertiesment
ట్విట్టర్ ట్రెండింగ్‌లో #Vanitha.. అసలు ఎవరామె?
, మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (12:32 IST)
అవును ట్విట్టర్ ట్రెండింగ్‌లో వనిత టాప్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరంటే? వనిత ప్రముఖ నటులు, దంపతులు విజయకుమార్, మంజుల కుమార్తె. ఈమె చుట్టూ వివాదాలే తిరుగుతూవుంటాయి. గతంలో తండ్రితోనే ఆస్తి వివాదంలో కయ్యానికి కాలు దువ్వింది. ప్రస్తుతం బిగ్ బాస్ మూడో సీజన్ తమిళ రియాల్టీ షోలో వివాదాలతో దూసుకెళ్తోంది. 
 
కానీ బిగ్ బాస్ ఇంటి నుంచి ఓటర్లు ఆమెను బయటికి పంపినా.. వనితాను మళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా పార్టిసిపెంట్‌గా బిగ్ బాస్ ఇంట్లోకి తెచ్చుకున్నారు. ఇందుకు కారణం హౌస్‌లో ఎప్పుడూ వివాదాలు వుండాలనుకోవడమే. ఆ పని ప్రస్తుతం బాగానే జరుగుతోంది. వనిత హౌస్‌లోకి కాలు పెట్టినప్పటి నుంచి వివాదాలు తప్పలేదు. 
webdunia


తాజాగా ఈ వారం షోలో వనిత ఓపెన్ నామినేషన్‌లో భాగంగా కవిన్, శాండీ అనే ఇద్దరు పార్టిసిపెంట్స్‌తో పాటు వనిత అందరినీ ఆటాడుకుంది. అయితే వనితను కూడా కవిన్ టీమ్ వదిలిపెట్టలేదు. 
 
సోమవారం ఇరు వర్గాల మధ్య పెద్ద వారే జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ప్రోమో వీడియోలో వాట్ నాన్‌సెన్స్ బిగ్ బాస్ అంటూ వనిత మైకును ఊడదీసింది. ఈ విషయం పెను సంచలనానికి దారి తీసింది. ఇంకా చేరన్, షెరిన్ బిగ్ బాస్ విజేతలయ్యే అర్హత లేదా అంటే ఆవేశంతో ఊగిపోయింది. ఇంకేముంది.. ఎమోషన్ అంటే ఏమిటో తెలియని వనితను తలచి ఏం చేసేదో తెలియక కవిన్ టీమ్ కామ్‌గా వుండిపోయారు. అయినా వనితాకు కవిన్ టీమ్‌కు మధ్య ఈ వారం పెద్ద వార్ జరగడం ఖాయమని  తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న అజ్ఞాతవాసి.. నేడు సాహో... ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ వెటకారపు మాటలు