Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్న అజ్ఞాతవాసి.. నేడు సాహో... ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ వెటకారపు మాటలు

Advertiesment
French Director Accuses Saaho Of Copying His Film Largo Winch: If You Steal My Work
, మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:26 IST)
ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాలే టాలీవుడ్ దర్శకుల గురించి వెటకారంగా మాట్లాడారు. ముఖ్యంగా, తాను నిర్మించిన 'లార్గో వించ్' సినిమాను ప్రీమేక్ చేసి 'అజ్ఞాతవాసి' పేరిట తీసి విఫలమైన తెలుగు దర్శకులు ఇప్పుడు దాదాపు అదే కథతో 'సాహో' తీశారన్నారు. ముఖ్యంగా, టాలీవుడ్ దర్శకులు ప్రీమేక్ అయినా సరిగ్గా తీయడం నేర్చుకోవాలంటూ సెటైర్ వేశారు. 
 
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' కథనం, ట్రీట్మెంట్‌ భిన్నంగా ఉన్నా, మూల కథ దాదాపు 'లార్గో వించ్‌' మాదిరే ఉందన్నారు. అందుకే తాను స్పందించినట్టు చెప్పారు. కనీసం కాపీ చేయడాన్ని అయినా సరిగ్గా చేయాలని వెటకారపు వ్యాఖ్య చేసిన ఆయన, తాను ఇండియాకు వస్తే, తన కెరీర్‌ ఆశాజనకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 
 
పైగా, గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రానికి మరో రూపమే సాహో అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వెంటకారపు మాటలపై సాహో డైరెక్టర్ సుజిత్ లేదా సాహో చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా స్పందించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీవీ సింధుగా అక్కినేని కోడలు వర్సెస్ దీపికా పదుకొనె