Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు జాగ్రత్తగా గంగవ్వకు కరోనా టెస్టు.. ఆహారం ప‌డ‌త‌లేద‌ని ఏడ్చేసిన గంగవ్వ

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (11:59 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్‌ కంటిస్టెంట్ గంగవ్వకు కరోనా టెస్టు నిర్వహించింది. క‌రోనా కాలంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక బోసిపోతున్న జ‌నాల‌కు వినోదాన్ని పంచేందుకు బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ ఘ‌నంగా ప్రారంభ‌మైంది. షోలో పాల్గొనే కంటెస్టెంట్ల‌ను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, అంద‌రికీ ప‌రీక్ష‌లు చేశాక నెగెటివ్ అని తేలితేనే లోనికి పంపించారు. 
 
కానీ తాజాగా షోలో ప‌నిచేసే కొంద‌రు టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు సమాచారం. మరోవైపు ఇంట్లోనూ గంగ‌వ్వ కాస్త అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే కొద్ది రోజులుగా వెళ్లిపోతా బిడ్డా అంటూ నోరు తెరిచి మ‌రీ వేడుకుంటోంది. కానీ ఆమె విన్నపాన్ని నాగ్ మ‌న్నించ‌లేదు. అది ప్రేక్ష‌కుల అభిప్రాయానికే వ‌దిలేస్తున్నానంటూ చేతులు దులిపేసుకున్నారు.
 
కానీ టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా సోకిన నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త‌గా గంగ‌వ్వ‌కు కూడా కోవిడ్‌-19 ప‌రీక్ష చేయించార‌ట‌. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందంటున్నారు. ఈ నేప‌థ్యంలో షో నిర్వ‌హ‌ణ‌కు మ‌రిన్ని క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు బిగ్‌బాస్ యాజ‌మాన్యం సిద్ధ‌మైంది. కాగా గంగ‌వ్వ వ‌రుస‌గా రెండోసారి కూడా ఎలిమినేష‌న్ రేసులో నిల‌బ‌డింది.  
 
కాగా.. గ‌త కొద్దిరోజులుగా పంపించండ‌ని వేడుకుంటున్న‌ గంగ‌వ్వ అనారోగ్యం బారిన ప‌డింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచాడు. ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగాడు. అంద‌రూ బాగానే చూసుకుంటున్నారు. కానీ భ‌ర్త కొట్టిన దెబ్బ‌లు ఇప్పుడు మ‌ళ్లీ  నొప్పెడుతున్నాయ‌ని చెప్పింది. తనకు ఇక్కడ వాతావార‌ణం, ఆహారం ప‌డ‌త‌లేద‌ని ఏడుస్తూ గోడు వెల్ల‌బోసుకుంది. మ‌ట్టిలో తిరిగేదాన్ని, ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నాన‌ని చెప్పింది. రెండు నెల‌లు ఉందామ‌నే వ‌చ్చాను, కానీ త‌న వ‌ల్ల కావ‌ట్లేదంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments