బిగ్ బాస్ విజేత ఎవరో తెలుసా? ఫోటో లీక్ అండ్ వైరల్

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (15:25 IST)
బిగ్ బాస్ తెలుగు ఫైనల్‌కు చేరుకుంది. నవంబర్ మూడో తేదీన ఫైనల్ జరుగనుంది. ప్రస్తుతం ఫైనల్లో ఎవరు విజేతగా నిలవనున్నారనే దానిపై చర్చ సాగుతోంది. 100 రోజులకు పైగా జరిగిన ఈ షోలో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా ఫైనల్స్ చేరారు. తమ ఫేవరేట్ కంటిస్టెంట్ల కోసం ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. 
 
అయితే తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. శ్రీముఖి విజేతగా నిలిచిందని ఓ పిక్ వైరల్ అయింది. ఆమె ట్రోఫీని పట్టుకొని నాగార్జునను హగ్ చేసుకున్న పిక్‌ను శ్రీముఖి అభిమానులు షేర్ చేస్తున్నారు. బిగ్ బాస్ గెలిచిన తొలి మహిళ అంటూ కామెంట్స్ కూడా పడుతున్నాయి. ఆదివారం ప్రసారం కావలిసిన షోను ముందే షూట్ చేశారని ఆ షూట్‌లోనే ఈ పిక్ బయటికి వచ్చిందని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఈ పిక్‌లో నిజం లేదని మిగిలిన కంటిస్టెంట్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ఈ షోలో గెలిచేది రాహులేనని కామెంట్లు చేస్తున్నారు.
 
మిగిలిన ఇంటి సభ్యుల అభిమానులు మాత్రం ఈ పిక్ నిజం కాదని షోని గెలిచేది రాహుల్ అని కామెంట్ చేస్తున్నారు. కానీ శ్రీముఖి విజేతగా నిలిచిందని బయటకు వచ్చిన ఫోటో సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. సీజన్-1లో శివ బాలాజీ, రెండో సీజన్‌లో కౌశల్ విజేతగా నిలిచారు. ఇక మూడో సీజన్‌లో మహిళా కంటిస్టెంట్ విజేత కానుందని టాక్ వచ్చేసింది. మరి ఇందులో ఎంతవరకు నిజం వుందో తెలుసుకోవాలంటే.. ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments