పునర్నవి అవుట్.. ఏడ్చేసిన రాహుల్.. నా వేస్ట్ ఫెల్లో అంటూ బిగ్ హగ్

Webdunia
సోమవారం, 7 అక్టోబరు 2019 (10:49 IST)
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌లో భాగంగా ఆదివారం నామినేషన్‌లో హౌస్ నుంచి పునర్నవి భూపాలం ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్‌లో ఉన్న వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్ట, పునర్నవి భూపాలంలో పునర్నవికి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. 
 
పునర్నవి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. స్టేజిపైకి వెళ్లిన పునర్నవి.. రాహుల్ వెళ్లిపోతున్నానని అనగానే.. రాహుల్ ఎమోషన్‌ని ఆపుకోలేకపోయాడు. దాంతో మిగతా హౌస్ మేట్స్ అతడిని ఓదార్చారు.
 
హౌస్ నుంచి బిగ్‌బాస్ స్టేజిపైకి వెళ్లిన పునర్నవికి చివరిసారి టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఇంటిలో ఉన్న వారిలో ఎవరికి హగ్ ఇస్తావు? ఎవరికి పంచ్ ఇస్తావు.? అని ప్రశ్నించారు. అందులో మహేష్, బాబా భాస్కర్‌కు పంచ్ ఇచ్చిన పునర్నవి... వితిక, వరుణ్, అలీకి మాత్రం హగ్ ఇచ్చింది. 
 
ఇక రాహుల్ 'నా వేస్ట్ ఫెల్లో' అంటూ బిగ్‌హగ్ ఇచ్చింది పునర్నవి. టాస్క్‌లపై దృష్టి పెట్టాలని.. ఓవర్ ఎక్సైట్ కావొద్దని రాహుల్‌కు సూచించింది. కోతి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఆడమని.. ఏమైనా అవసరముంటే వరుణ్, వితికతో చర్చించాలని సలహాలు ఇచ్చింది. ఇక ఇంట్లో బాబా భాస్కర్ బానిసగా ఉండాలని, అలీ రెజా మాస్టర్‌గా ఉండాలని బిగ్ బాంబ్ వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు

విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా అమరావతి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్

శబరిమల ఆలయం బంగారం కేసు.. టీడీబీ అధికారిని అరెస్ట్ చేసిన సిట్

జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments