రవిగాడు వెధవ, వాడితో నాకేంటి మాటలు? పున్ను ఫైర్.. వితిక అడగటంతో?

బుధవారం, 25 సెప్టెంబరు 2019 (10:31 IST)
బిగ్ బాస్ రియాల్టీ షోలో పునర్నవి రెచ్చిపోయింది. బిగ్‌బాస్ ఆదేశంతో హౌస్‌లో చర్చ మొదలైంది. బాబా భాస్కర్-వరుణ్ సందేశ్ మధ్య చర్చ మొదలైంది. ఈ సందర్భంగా బాబా భాస్కర్ మాట్లాడుతూ.. పునర్నవి హౌస్‌లో ఉంటే తనకు సమస్య లేదని, కానీ తనకు భాష రాదని విమర్శించడం సరికాదన్నాడు. ఆమె తనపై ఆరోపణలు చేస్తే కల్పించుకోవాలని తనకు అనిపించలేదని... అందుకే వివరణ ఇవ్వలేదని పేర్కొన్నాడు.  
 
ఆ తర్వాత పునర్నవి-రాహుల్ మధ్య కూడా నామినేషన్‌పై చర్చ మొదలైంది. ఈ చర్చలోకి వరుణ్ సందేశ్, వితికలు ఎంటరవడంతో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో రవి తనపై చేసిన ఆరోపణలపై వితిక అంతెత్తున లేచింది. దీంతో ‘నువ్వు రవితో మాట్లాడావా?’ అని పునర్నవిని హౌస్ మేట్స్ అడిగారు. దీనికి తాను లేదని సమాధానం ఇస్తూ చెలరేగిపోయింది. 
 
రవిగాడు వెధవ, అతనితో తానెందుకు మాట్లాడాలని.. వాడి సొల్లు డిస్కషన్ ఎందుకు దండగ అంటూ నోటికొచ్చినట్లు పునర్నవి ఫైర్ అయ్యింది. సెన్స్‌లెస్ ఆర్గ్యుమెంట్ చేసే అటువంటి వెధవలతో మాట్లాడాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పింది. హౌస్‌మేట్స్ ఆగమని చెబుతున్నా పునర్నవి మాత్రం రవిని ఓ రేంజ్‌లో తిట్టిపోసింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం డేటింగ్ పూజాతో.. పెళ్ళి సాయపల్లవితో అంటున్న యువ హీరో