Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్-5: 7th సెప్టెంబర్ హైలైట్స్.. రచ్చ రంబోలా.. చేపల మార్కెట్‌లా..?

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (10:36 IST)
బిగ్ బాస్ హౌస్‌ ఆట మొదలైంది. తొలి వారం నామినేషన్‌లో ఆరుగురు ఉండగా.. నేటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. బిగ్ బాస్ సీజన్ 5 తొలిరోజు ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ పరిచయం.. రెండో రోజు ఎపిసోడ్‌లో నామినేషన్ హీట్ చూశాం. మొత్తం 19 కంటెస్టెంట్స్‌లో ఇద్దరు ముగ్గురు తప్పితే మిగిలిన వాళ్ల ముహాలు కాదు కదా.. వాళ్లు పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టంగా మారింది. 
 
క్యురేక ఆన్‌లైన్ క్విజ్‌తో బోలెడంత టైం పాస్ అయ్యింది. దానితో పాటు కాయిన్లు గెలుచుకోవచ్చు
అయితే బిగ్ బాస్ షోలోకి ఏ మాత్రం పాపులారిటీ లేకుండా వచ్చినప్పటికీ పాపులర్ సెలబ్రిటీలుగా మార్చేస్తుంటారు బిగ్ బాస్. 
 
దీనికి అతని దగ్గర ఉన్న ప్రధాన అస్త్రం పెంట పెట్టడం. అవును నిజమే.. ఒకటి రెండు గొడవలు పెట్టాడంటే దెబ్బకి పాపులర్ అయిపోతారు. బిగ్ బాస్ అంటేనే గొడవలు.. తిట్లు.. దూషణలు.. ఏడుపులు.. గోలలు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ రెండో రోజునే ఇంట్లో వాళ్ల నామినేషన్ పేరుతో ఫిటింగ్ పెట్టారు.
 
ఇక మూడో రోజు (సెప్టెంబర్ 7)న ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ఇదే రచ్చ కంటిన్యూ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ట్రాన్స్ జెండర్‌గా మారిన ప్రియాంక.. తాను ఎందుకు అలా మారాల్సి వచ్చిందో చెప్తూ మళ్లీ తన కష్టాలను హౌస్ మేట్స్‌తో చెప్పుకొచ్చింది. 
 
‘ట్రాన్స్ జెండర్‌గా మారకుండా వేరే వాళ్లని పెళ్లి చేసుకుని ఉంటే.. నన్ను నేను మోసం చేసుకోవడమే కాకుండా.. మరో అమ్మాయికి అన్యాయం చేయాల్సి వస్తుందని నా స్నేహితురాలు నిషాతో నా బాధ చెప్పుకున్నాను.. దాంతో ఆమె పదవే నేను కూడా వస్తా.. ఆపరేషన్ చేయించుకుందా అని చెప్పింది.. ఒకే ఒక్కరాత్రిలో మేం ఆ నిర్ణయం తీసుకున్నాం.. అనుకున్న వెంటనే ఫ్లైట్ ఎక్కి వెళ్లి ఆపరేషన్ చేయించేసుకున్నాం.. ఆ ఆపరేషన్ చేయించుకున్నాక చాలా బాధపడ్డాను.. భరించలేని నొప్పితో నరకం చూశాను. ఒంట్లో నరాలన్నీ మిక్సీలో వేసినట్టు ఉండేది.. నరకం చూశాను’ అంటూ చెప్పుకొచ్చింది.
 
ఆ తరువాత సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్‌కి సాంగ్‌కి స్టెప్పులు వేసి రచ్చ చేశారు కంటెస్టెంట్స్. అయితే ఇంట్లో పనులు చేయకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారని కాస్త సీరియల్ అయ్యింది ఉమాదేవి. ఇక కిచెన్‌ పనిచేస్తున్న శ్వేత, సరయులు.. మీరు వాళ్లందరికీ కాస్త సీరియస్‌గా చెప్పండని అన్నారు. కొంతమంది వర్క్ చేయడం లేదని అన్నది సరయు.
 
మరోవైపు లహరి-కాజల్‌ల మధ్య డిస్కషన్ నడిచింది. మన ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్టు ఉంది.. కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని కాజల్ అనడంతో.. అది ఫ్లోలో జరగాలి తప్ప ఇలా మాట్లాడుకుంటే కాదు అని చెప్పింది లహరి.
 
ఈ సీజన్‌లో కొత్తగా ప్రారంభించిన పవర్ రూం పవర్ కోసం ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం ఈ పవర్ రూం పవర్‌ని సంపాదిస్తే.. ఆటని మార్చే శక్తి లభిస్తుందని చెప్పారు బిగ్ బాస్. ఈవారం కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ ‘శక్తి చూపరా డింబకా’ అని.. దీనిలో భాగంగా ఇంట్లో ఉరుముల శబ్ధం వచ్చిన ప్రతిసారి ఇంటిసభ్యులు వెళ్లి పవర్ రూం ముందు ఉంచిన బటన్‌ని ప్రెస్ చేయాలని ఎవరైతే అందరికంటే ముందు వెళ్లి బటన్‌ని ప్రెస్ చేస్తారో వాళ్లకే పవర్ రూం శక్తి లభిస్తుందని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
 
ఈ పవర్ రూం టాస్క్‌లో విశ్వ విజేతగా నిలవడంతో.. ఇంట్లో ఇద్దరు సభ్యుల వస్తువులతో పాటు.. ఒంటిపై ఉన్న బట్టలతో సహా స్టోర్ రూంలో పెట్టాల్సి ఉండంతో యాంకర్ రవి, ప్రియ పేర్లు చెప్పాడు విశ్వ. అయితే ఇక్కడ ఫిటింగ్ ఏంటంటే.. వాళ్లు ఆపోజిట్ జెండర్ బట్టలు వేసుకోవచ్చని చెప్పారు బిగ్ బాస్.
 
ఇక వాష్ రూం క్లీనింగ్‌లో ఉన్న లోబో బట్టలు, బనియన్లు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని నవ్వుతైనే సెటైర్లు వేశాడు. ఆ తరువాత ప్రియాంక.. రవి, సన్నీలను అన్నయ్య అంటూ మానస్‌ని మాత్రం అలా అనలేను అని అనడంతో ఇంటి సభ్యులు సరదాగా ఆటపట్టించారు.
 
మరోవైపు చూడ్డానికి బలంగా కండలు తిరిగిన శరీరంతో కనిపించే విశ్వ.. చనిపోయిన తన తమ్ముడ్ని గుర్తు చేసుకుని బోరు బోరున ఏడ్చేశాడు. యాంకర్ రవి.. తనని అన్నా అని పిలవడంతో.. తన తమ్ముడ్ని గుర్తు చేసుకున్నాడు.. ఏడవ కూడదని అనుకున్నా కానీ.. తమ్ముడు గుర్తొచ్చేసరికి తట్టుకోలేకపోయా అని విలపించాడు విశ్వ.
 
ఇక లోబో-సిరిలు గట్టిగా అరుస్తూ గొడవపడ్డారు.. అయితే వాళ్లు ఆట పట్టించడానికే గొడవపడినట్టు చివర్లో తుస్ అనిపించడంతో ఇంటి సభ్యులంతా కంటెంట్ కోసం ఇలా చేయొద్దని చురకలు వేసింది సరయు. అనంతరం లోబోతో దమ్ కొడుతూ.. తన యూటిట్యూడ్ చూపించింది సరయు.
 
పవర్ రూం టాస్క్‌లో భాగంగా ఈసారి మానస్‌కి అవకాశం లభించింది.. ఈ పవర్ ప్రకారం ఇంట్లో ఒకర్ని ఎంచుకోవాలి.. వాళ్లు హౌస్‌లో అందరూ పడుకున్న తరువాతే పడుకోవాలి.. అనే కండిషన్ ఉండటంతో మానస్.. ఆర్జే కాజల్‌ని ఎంచుకున్నాడు. దీని ప్రకారం ఇంట్లో వాళ్లంతా పడుకున్న తరువాతే కాజల్ పడుకోవాలి.. ఎవరు మెల్కొని ఉన్నా కాజల్‌కి జాగారం తప్పదన్నమాట.
 
ఇక హౌస్‌లో కాజల్-లహరిల మధ్య హీట్ డిస్కషన్ నడించింది.. కాజల్ తనకి కావాలని టార్గెట్ చేస్తుందని.. కంటెంట్ కోసం తెగ ప్రయత్నిస్తుందంటూ ఓరేంజ్‌పై హైపర్ అయ్యింది లహరి.
 
కాజల్ ఎంత పాజిటివ్‌గా మాట్లాడాలని ప్రయత్నించినా లహరి సై అంటే సై అని గొడవకు దూసుకుని వెళ్లింది.. నీలో పాజిటివ్ వైబ్స్ లేవు.. అటాకింగ్ పొజిషన్‌కి వస్తే నేను ఒప్పుకోను.. నువ్ ఇక్కడికి ఎందుకు వచ్చావో నేనూ అందుకే వచ్చా.. బిగ్ బాస్ నీకు డ్రీమ్ ఎలాగో నాకూ డ్రీమ్ అంతే అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే కాజల్ మాత్రం వెనక్కి తగ్గి.. లహరికి సారీ చెప్పింది.. నేను నిన్ను హర్ట్ చేసి ఉంటే క్షమించు అని ఎమోషనల్ అయ్యింది కాజల్. ‘నేను ఇలా ఏడ్వడం నా కూతురు చూస్తే ఏమౌతుంది’.. భావోద్వేగానికి గురైంది కాజల్. అనంతరం రవి, మానస్‌లు ఆమెను ఓదార్చుతూ కనిపించారు.
 
అయితే రవి.. ఆమెను ఓదార్చుతూనే నాకు కూడా కాస్త.. అటాకింగ్‌లో ఉన్నట్టు నాకు కూడా అనిపించింది. లీడ్ తీసుకోవడం కొంత మందికి నచ్చదు అని చెప్పాడు రవి.
 
ఇక జెస్సీ మరోసారి హమీదాతో గొడవకు దిగాడు. దీంతో ఆనీ మాస్టర్ ఇచ్చిపడేసింది. కూర్చుని ఉండే స్టూల్‌పై కాలుపెట్టి జెస్సీ తన యాటిడ్యూడ్ చూపించాడు. దీంతో ఆనీ మాస్టర్ అతనిపై రంకెలు వేసి రచ్చ రచ్చ చేసింది. మర్యాద ఇవ్వకపోతే నేను ఊరుకోను అని అంటూ చిందులువేసింది ఆనీ మాస్టర్. దీంతో జెస్సీ క్షమాపణ చెప్పినా ఆనీ మాస్టర్ వెనక్కి తగ్గలేదు.. ఒకర్నొకరు దూషించుకున్నారు. అనంతరం ఆనీ మాస్టర్ రాత్రి పూట ఏడుస్తూ కనిపించింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో హమీదా-లహరిల మధ్య రచ్చరేగుతోంది.
 
మొత్తంగా నేటి ఎపిసోడ్ మొత్తం రచ్చ రంబోలాలా సాగింది. చేపల దుకాణాలను మరపించారు. దూషణలు తిట్లతో చెలరేగిపోయారు. కాజల్ కాస్త అత్యుత్సాహం చూపించినా.. లహరి ఆ రేంజ్ రియాక్షన్ అనవసరం అనే అనిపించింది. 
 
ఇక ఆనీ మాస్టర్ అయితే కావాలని గొడవపెట్టుకున్నట్టే అనిపించింది. జెస్సీ మొదట యాటిట్యూడ్ చూపించినా తరువాత సారీ చెప్పాడు.. అయినప్పటికీ ఆమె ఎక్కువ హైపర్ అయిపోయి అతి చేసినట్టే అనిపించింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కూడా ఇంతకు రచ్చ ఉన్నట్టుగా ప్రోమో వదిలారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments