బుల్లితెరపై బోలెడంత వినోదాన్నిపంచే కార్యక్రమాల్లో 'బిగ్ బాస్' ఒకటి. ఇది మరోమారు సందడి చేసేందుకు సిద్ధమైంది. 'బిగ్ బాస్ సీజన్-5' రియాల్టీ షో ప్రసారాలు త్వరలోనే ప్రసారంకానున్నాయి.
హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం తెల్సిందే. గత నాలుగు సీజన్లలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆలరించింది. ఇక తెలుగులో ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది.
మరోవైపు, ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్ పేర్లు ఒక్కొక్కటిగా లీకవుతున్నాయి. అయితే కొత్త కొత్త పేర్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రేపు (సెప్టెంబర్ 5న) బిగ్బాస్ స్టార్ట్ కాబోతుండడంతో బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే లెటేస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ షో రేపు ప్రారంభం కాబోతుండడంతో ఈరోజే కంటెస్టెంట్లను హౌస్లోకి పంపుతున్నారు నిర్వహకులు. గత కొద్ది రోజులుగా తాజ్ డెక్కన్, మారియట్ హోటల్లలో క్యారంటైన్లో ఉన్న పార్టిసిపెంట్లను ప్రస్తుతం హౌస్లోకి ప్రవేశపెడుతున్నారు. శనివారం సాయంత్రానికి బిగ్బాస్ హౌస్ ఎంట్రీ పూర్తి కానుంది. ఇక రేపు సాయంత్రం బిగ్బాస్ ప్రసారం కానుంది.
మరోవైపు, బిగ్బాస్ హౌస్లోకి వెళ్తున్న కంటెస్టెంట్స్ పేర్లను ఓ సారి పరిశీలిస్తే, యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి హౌస్లోకి వెళ్తున్నారు.