బిగ్ బాస్ తెలుగు సీజన్-7: సీక్రెట్ రూమ్‌కు ఎవరు..? వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:09 IST)
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 రెండో వారం హాట్ హాట్‌గా సాగుతోంది. వాగ్వాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొదటి వారంతో పోలిస్తే ఓటింగ్ కూడా రివర్స్ అయింది. రాధికా రోజ్‌కి ఆదరణ పడిపోతోందని ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతోంది. 
 
మరోవైపు ఇంటింటా ఎక్కువగా టార్గెట్‌ అవుతున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఓటింగ్‌లో పట్టు సాధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. రెండో వారం నామినేషన్ల పర్వం నుంచి గేమ్ వేడెక్కింది.
 
ఈ తరుణంలో బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వనుందనే లీకులు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రెండో వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో లీకులు వినిపిస్తున్నాయి. 
 
ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రెండో వారంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారి అందరి టార్గెట్‌గా మారిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌కి పంపనున్నారనే టాక్ వినిపిస్తోంది. 
 
బిగ్ బాస్ 3వ సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ని సీక్రెట్ రూమ్‌కి పంపారు. ఇప్పుడు 7వ సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌ని ఆ సీక్రెట్ రూమ్‌కి పంపనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజమో ఈ వారాంతంలో ఎపిసోడ్‌లో తేలిపోనుంది. 
 
పల్లవిని సీక్రెట్ రూమ్‌కి పంపితే ప్రశాంత్ స్క్రీన్ టైమ్ పెరుగుతుంది. మరోవైపు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి షకీలా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వయసు రీత్యా ఇంట్లో చురుగ్గా ఉండలేకపోతున్నారు. 
 
ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్‌లో మరో సీరియల్ నటుడు కనిపించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అగ్నిసాక్షి సీరియల్ ఫేమ్ అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments