గృహోపకరణాలలో గ్లోబల్ లీడర్, 14 సంవత్సరాలుగా మేజర్ అప్లయెన్సెస్‌లో ప్రపంచంలోనే నంబర్ 1 బ్రాండ్ అయిన హైయర్ అప్లయెన్సెస్ ఇండియా (హైయర్ ఇండియా), ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఈరోజు వెల్లడించింది. విభిన్నమైన, ఆసక్తికరమైన పోటీదారుల కలయికతో, భావోద్వేగాలు- వినోదంతో నిండిన రోలర్‌కోస్టర్ రైడ్‌గా నిలిచే బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- స్టార్ మాలో ప్రసారం చేయబడుతుంది.
ఈ భాగస్వామ్యం గురించి హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ సతీష్ ఎన్ఎస్ వ్యాఖ్యానిస్తూ, "ఈ ప్రాంతంలో అత్యధికంగా వీక్షించబడే టెలివిజన్ షోలలో ఒకటైన 'బిగ్ బాస్ 7' తెలుగుతో మళ్లీ అనుబంధం కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. వినూత్నమైన, విశ్వసనీయమైన మరియు సాంకేతికతతో నడిచే గృహోపకరణాలను అందించడం ద్వారా భారతీయ వినియోగదారుల రోజువారీ జీవితంలో భాగం కావడానికి హైయర్ ఎల్లప్పుడూ కృషి చేస్తోంది. వినియోగదారులతో కనెక్ట్ అవ్వడానికి మాకు గొప్ప అవకాశాన్ని బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అందిస్తుంది. భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన టెలివిజన్ షోలలో ఒకదాని ద్వారా మా ప్రేక్షకులకు చేరుకోవటానికి ఈ సినర్జిస్టిక్ సహకారం గురించి మేము నిజంగా గర్విస్తున్నాము" అని అన్నారు.