Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చక్ర గోల్డ్ ప్రీమియం లీఫ్ టీని ఏపి-తెలంగాణ మార్కెట్‌లో విడుదల

Advertiesment
Rashmika Mandanna
, శనివారం, 9 సెప్టెంబరు 2023 (22:32 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ప్రముఖ టీ బ్రాండ్‌లలో ఒకటిగా వెలుగొందుతున్న, టాటా టీ చక్ర గోల్డ్ తమ తాజా వేరియంట్ టాటా టీ చక్ర గోల్డ్ ప్రీమియం లీఫ్ టీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రీమియం అస్సాం లీఫ్ టీల ఎంపికతో పాటు పర్వతాలపై పెరిగిన మొక్కల నుండి సేకరించిన పొడవాటి ఆకులతో తయారుచేయబడిన కొత్త వేరియంట్ గొప్ప రుచి, ఆహ్లాదకరమైన సువాసన యొక్క తాజా మిశ్రమాన్ని అందిస్తుంది.
 
టాటా టీ చక్ర గోల్డ్ ఎల్లప్పుడూ తమ వినియోగదారులను సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంది, అసలైన యాలుకలు, టాటా టీ చక్ర గోల్డ్ కేర్ యొక్క తాజా రుచి, సువాసనతో కూడిన డస్ట్ టీ - టాటా టీ చక్ర గోల్డ్. ఇలాచీ వంటి వేరియంట్‌లను విడుదల చేయడం ద్వారా వినియోగదారుల  అభివృద్ధి చెందుతున్న అవసరాలను ఐదు సహజ పదార్థాల మంచితనం కలిగిన టీ ద్వారా తీర్చడం జరుగుతుంది. 
 
కొత్త టాటా టీ చక్ర గోల్డ్ లీఫ్ ఫిల్మ్, బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందన్న జీవితం నుండి ప్రేరణ పొందింది, పట్టుదల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూనే  కష్టపడి పనిచేయడం మరియు ఎప్పుడూ వదులుకోవద్దు/ ఎప్పుడూ కోల్పాయామనే నిరాశ వైఖరిని ఎంచుకోరాదని వెల్లడించటం సహా సరైన ఎంపికలను చేయడం ద్వారా కలలను సాకారం చేసుకోవటం, విజయం సాధించడం ఆవశ్యకతను తెలుపుతుంది. టాటా టీ చక్ర గోల్డ్‌తో తన అనుబంధం గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ, "టాటా టీ చక్ర గోల్డ్ కుటుంబంలో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. బ్రాండ్ విలువలు నా వ్యక్తిగత ప్రయాణంతో సరిపోతాయి, ఇది కృషి, ప్రామాణికత మరియు శ్రేష్ఠత, సాధనను ప్రతిబింబిస్తుంది. ఇది నా విజయం యొక్క ఎంపిక. ప్రతి వ్యక్తి ప్రయాణం యొక్క శక్తిని, అది తెచ్చే బలాన్ని నేను విశ్వసిస్తాను. టాటా టీ చక్ర గోల్డ్ ఆ నమ్మకంతో ప్రతిధ్వనిస్తుంది, ఈ అనుబంధాన్ని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రన్న అరెస్ట్- ఆదివారం ఆమరణ నిరాహార దీక్షకు టీడీపీ పిలుపు