Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ 5: గత వారాల కంటే భిన్నంగా నామినేషన్ ప్రక్రియ

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (12:43 IST)
బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సోమవారం నామినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ ఇంటి సభ్యుల భావోద్వేగాల మధ్య జరిగింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ గత వారాల కంటే భిన్నంగా జరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి తమ కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లేఖలను ఎవరైతే తీసుకుంటారో ఆ ఇంటి సభ్యుడు ఈ వారం నామినేషన్ నుండి బయటపడుతాడు.
 
అయితే ఈ ప్రక్రియలో ఇద్దరు ఇంటి సభ్యులు పవర్ రూమ్ కి వెళ్లి బిగ్ బాస్ ఇచ్చిన లెటర్స్ బ్యాగ్ నుండి ఇద్దరు హౌస్ మేట్స్ కి సంబంధించిన రెండు లెటర్స్ లో ఏ ఇంటి సభ్యుడికి అయితే ఇస్తారో ఆ కంటెస్టెంట్ ఆ లెటర్ ని పొందటమే కాకుండా ఈ వారం నామిషన్ నుండి బయటపడుతారని బిగ్ బాస్ ప్రకటిస్తాడు.
 
ఇక ఈ ప్రక్రియలో మొదటగా శ్రీరామచంద్ర, మానస్ పవర్ రూమ్ కి వెళ్లి ప్రియాంక సింగ్, లోబోల లెటర్స్ ని తీసుకొచ్చారు. అందులో లోబో - ప్రియాంక సింగ్ కి లెటర్ ఇవ్వమనడం.. ప్రియాంక కూడా తన తల్లిదండ్రుల నుండి వచ్చిన లెటర్ తనకి కావాలని చెప్పడంతో మానస్, శ్రీరామ్ కలిసి ప్రియాంక సింగ్ కి లెటర్ ఇచ్చారు. ఆ తరువాత ప్రియాంక సింగ్ - కాజల్ పవర్ రూమ్ నుండి తెచ్చిన లెటర్ బాక్స్ లో మానస్ - ఆనీ మాస్టర్ లెటర్స్ ఉండటంతో మానస్.. ఆనీ మాస్టర్ కోసం తన లెటర్ ని వదులుకొన్నాడు.
 
రవి - షణ్ముఖ్ జస్వంత్ తెచ్చిన లెటర్స్ లో విశ్వ - సిరి హనుమంత్ లెటర్స్ ఉండటంతో తన కొడుకుని మిస్ అవుతున్నానని విశ్వ చెప్పడంతో సిరి హనుమంత్ ఎమోషనల్ అయి నవ్వుతూనే విశ్వా నీ లెటర్ తీస్కో అనడం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ఇక లోబో - విశ్వ తెచ్చిన లెటర్స్ లో రవి - శ్రీరామ్ లెటర్స్ ఉండటం అందులో శ్రీరామచంద్ర లెటర్ ని పొందటం,
 
సిరి హనుమంత్ - ఆనీ మాస్టర్ తెచ్చిన లెటర్స్‌లో షణ్ముఖ్ జస్వంత్ - ఆర్జే కాజల్ లెటర్స్ ఉన్నాయి. ఇద్దరు ఒకరికొకరు మొదట తీసుకోమని చెప్పిన చివరికి షణ్ముఖ్ జస్వంత్ తన తల్లి పంపిన లెటర్ ని కాదని కాజల్ లెటర్ తీసుకోమని చెబుతూ తన తల్లి క్యాన్సర్ ని, అమ్మమ్మ చనిపోయినపుడు ఎలా సర్వైవ్ అయిందో తెలుసనీ నేను అలానే ఉంటానంటూ తన లెటర్ ని కాజల్ కోసం త్యాగం చేస్తాడు.
 
ఇక మిగిలిన జెస్సి లెటర్ కోసం ఇంటి సభ్యులు ఎవరో ఒకరు తమకు వచ్చిన లెటర్స్ లో త్యాగం చేయాలని అలా అయితేనే జెస్సి తన కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లెటర్ ని పొందగలుగుతాడని కెప్టెన్ సన్నీకి చెప్పడంతో ఇంటి సభ్యులకు ఈ విషయాన్ని సన్నీ చెప్తాడు. 
 
అపుడు శ్రీరామ చంద్ర తన లెటర్ ఇచ్చి జెస్సి కోసం త్యాగం చేశాడు. ఇంటి కెప్టెన్ అయినందున విజే సన్నీకి ఇలాంటి షరతులు లేకుండా బిగ్ బాస్ లెటర్ ని ఇస్తాడు. ఇక ఈ వారం నామినేషన్‌లో సిరి హనుమంత్, షణ్ముఖ్ జస్వంత్, లోబో, రవి, శ్రీరామచంద్ర, మానస్‌లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments