Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ ఐదో సీజన్.. షణ్ముఖ్ గ్రూప్‌తో తలనొప్పి.. నామినేషన్ తప్పదా?

Advertiesment
బిగ్ బాస్ ఐదో సీజన్.. షణ్ముఖ్ గ్రూప్‌తో తలనొప్పి.. నామినేషన్ తప్పదా?
, బుధవారం, 6 అక్టోబరు 2021 (15:03 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది.  ఈ రియాల్టీ షో ఐదో వారానికి చేరుకుంది. ఇప్పటికే పలువురు వీక్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారు తమకు తోచిన స్ట్రాటజీలతో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అయితే హౌస్‌లో ఎక్కువగా గొడవలు మాత్రమే జరుగుతుండడం గమనార్హం. ఈరోజు కెప్టెన్ టాస్క్ కంటెండర్ల కోసం జరగనున్న ఫైట్ మాత్రం ఆసక్తిని రేపుతోంది.
 
ఇదిలా వుంటే.. సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్ టాస్క్ జరిగింది. అందులో షణ్ముఖ్‌ను 8 మంది కంటెస్టెంట్‌లు నామినేట్ చేశారు. కాగా ఈ వారం తొమ్మిది మంది పోటీదారులు నామినేట్ అయ్యారు. వారిలో ప్రియా, మానస్, లోబో, యాంకర్ రవి, జశ్వంత్, షణ్ముఖ్, సన్నీ, విశ్వ, హమీదా ఉన్నారు. అయితే నామినేషన్ నుంచే మొదలైన రచ్చ ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. 
 
ముఖ్యంగా హౌస్ లో గ్రూపిజం తయారయ్యింది. జశ్వంత్, షణ్ముఖ్, సిరి ఒక గ్రూప్ అయ్యి, ఒకే చోట కూర్చోవడం కన్పిస్తోంది. ఇక ఫుడ్ దగ్గర జరిగిన గొడవలో శ్రీరామ్ తప్పేమీ లేకపోయినా షణ్ముఖ్ గ్రూప్ కావాలనే అతనిపై విరుచుకు పడడం నెగెటివిటీని పెంచుతోంది. 
 
జశ్వంత్ చేసిన రాంగ్ కామెంట్ ఈ రచ్చకు కారణమైంది. షణ్ముఖ్ గ్రూప్ పై జశ్వంత్ వల్ల బాగానే ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. పైగా అతని ప్రవర్తనే అతన్ని ఈ వారం బయటకు వెళ్లేలా చేస్తుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"మా" అధ్యక్షుడుగా మనలో ఒకడు పనికిరాడా? రవిబాబు ప్రశ్న