Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోబో సడెన్‌గా వచ్చి లోపలికి చేయిపెట్టాడు.. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ

లోబో సడెన్‌గా వచ్చి లోపలికి చేయిపెట్టాడు.. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:57 IST)
Lobo
బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల డ్రామాలకు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక్కరిని ఒక్కరూ పచ్చిగా మాటలు అనేసుకునే వాళ్లు కొందరైతే.. లెట్ నైట్‌లో రెస్ట్‌రూంలో దూరి రొమాన్స్ చేసేవాళ్లు మరొకరు. 
 
చిత్ర విచిత్రమైన లవ్ ట్రాక్స్ మరోపక్క. నామినేషన్ వచ్చేసారికి నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. ఒకరిపై ఒకరు నిందలు చేసుకోవడం పరిపాటైంది. మొన్న ప్రియ మాట్లాడుతూ.. రవి- లహరి బాత్రూమ్‌లో హగ్గులు చేసుకుంటున్నారని సంచలన విషయాన్నీ బయట పెట్టింది. దాంతో హౌస్‌లో ఉన్నవాళ్లే కాదు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.
 
ఆ షాక్ నుంచి తెరుకోకముందే.. మంగళవారం నాటి 17వ ఎపిసోడ్‌లో మరో అరాచకం బయటపడింది ప్రియాంక. అది కూడా లోబోపై.. తనతో లోబో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రియాంక షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 
బిగ్ బాస్ హౌస్‌లో డిఫరెంట్ కంటెస్టెంట్ లోబో . తలపై చిన్న పిలక.. పిల్లి గడ్డం.. మెడలో లాకెట్‌లు.. కళ్లకి చెవులకి రింగ్‌లు. అంతా వెరైటీ .. వీడెవడ్రా బాబూ అనేట్టుగానే కనిపించాడు. తన దైన యాస, భాషలతో ఆకట్టుకుంటూ కనిపించాడు. కానీ ప్రియాంక మాత్రం ఆసలు లోబో బండారాన్ని బయటపెట్టింది.
 
కిచెన్లో ప్రియాంక. ప్రియ, కాజల్, సిరి కూర్చుని ఉండగా.. ప్రియాంక మాట్లాడుతూ.. సాయంత్రం నేను హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకునా.. అది కొంచెం అన్ ఫీట్‌గా, కాస్త ఇబ్బందిగానే ఉందని తెలుసు.. వీలైనంత వరకూ కవర్ చేస్తుకుంటునే ఉన్నా.. ఆ సమయంలో లోబో ఏదో మాట్లాడుతూ.. నాకు రెండు మూడు సార్లు సైగ చేశాడు. వెంటనే నాకు సీన్ అర్థమైంది. దీంతో మరింత జాగ్రత్తగా ఉన్నా. కానీ, లోబో సడెన్‌గా వచ్చి లోపలికి చేయిపెట్టాడు. కానీ నేను దాన్ని చాలా ఫన్నీగా తీసుకున్నా.. పట్టించుకోలేదు.. వెంటనే నేను వెళ్లి డ్రెస్ మార్చేసుకున్నా' అని ప్రియాంక చెప్పింది.
 
ఈ షాకింగ్ కామెంట్స్ విన్న కాజల్ మరి నువ్వు ఏం అనలేదా.. ? నువ్వు ఎలా ఊరుకున్నావ్‌? వెంటనే సీరియస్ అవ్వాలి కదా..? నీ కోసం నువ్ స్టాండ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు. నువ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి కాదా అంది కాజల్. ఆతర్వాత .. వారి పక్కనే ఉన్న సిరి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని నేను రవికి చెప్తాను అంది. ఇంతలో సర్లే వదిలేయండిలే అని అన్నది ప్రియాంక. అయితే ఈ విషయాన్ని ప్రియాంక చెప్తున్నప్పుడే అక్కడికి లోబో వచ్చి .. ప్రియాంకను హగ్ ఇచ్చాడు. లవ్ యూ డోన్ట్ వర్రీ అని అనేసింది ప్రియాంక.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బప్పిలహరి' గొంతు మూగబోయిందా? క్లారిటీ ఇచ్చిన సింగర్