Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోబో ఓవర్ యాక్షన్.. ఎక్స్ ట్రా డోస్ యాడ్ చేస్తే..?

లోబో ఓవర్ యాక్షన్.. ఎక్స్ ట్రా డోస్ యాడ్ చేస్తే..?
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (15:38 IST)
Lobo
బిగ్ బాస్ సీజన్ 5లో ఛాన్స్ దక్కించుకున్న లోబో.. హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి రోజు మాత్రమే కాదు. రెండో రోజు సైతం తన యాటిట్యూడ్ ను చూపించాడు. రెస్ట్ రూమ్స్ సరౌండింగ్స్ క్లీనింగ్ బాధ్యతను లోబో తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. అక్కడ విడిచిన బట్టలను తగిలించడానికి కొక్కాలు (హుక్స్) లేవని, వాటిని తక్షణమే పెట్టించమని బిగ్ బాస్ నిర్వాహకులకు లోబో కాస్తంత గట్టిగానే చెప్పాడు. 
 
అదే సమయంలో శ్వేత వర్మతోనూ కాస్తంత స్వరం పెంచి మాట్లాడాడు. ఈ విషయంలోనే కాదు. తనతో ఎవరు కాస్తంత ఎదురు మాట్లాడినా సహించేదే లేదంటున్నాడు లోబో. అయితే. అలాంటి యాటిట్యూడ్ ఉన్న లోబో. రెండో రోజు మధ్యాహ్నం సిరితో గొడవ పెట్టుకోవడం. ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకోవడం చూసి అది నిజంగా జరుగుతున్నదే అని చాలా మంది భ్రమపడ్డారు. 
 
కానీ ఆ తర్వాత అది అబద్ధమని తేలిపోయింది. ఈ విషయంలో ఇటు సిరి, అటు లోబో ఇద్దరిదీ తప్పు ఉన్నా స్మోకింగ్ ఏరియాలో ఈ విషయమై లోబో.. సరయుకు వివరణ ఇచ్చి, తాము చేసిన ప్రాంక్‌కు మెడలో ఉన్న మైక్ సాక్షం అని చెప్పడంతో ఆమె సైతం కన్వెన్స్ అయిపోయింది. 
 
మామూలుగా ఉంటేనే లోబో ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపిస్తుంది. దానికి మరింత ఎక్స్ ట్రా డోస్ యాడ్ చేస్తే తట్టుకోవడం కష్టమే. ఈ విషయాన్ని లోబో ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని వ్యూవర్స్ అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అషురెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూ చాలా బాగుందట... ఎవరన్నారు?