బిగ్ బాస్ ఫినాలేకు బడా స్టార్.. అఖిల్ లేదా అభిజీత్‌.. ఎవరు విన్నర్?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:00 IST)
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ చివరి అంకానికి చేరుకుంది. 19మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోని అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. శని, ఆది వారాలలో చాలా స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చే నాగ్‌ హౌజ్‌మేట్స్‌తో కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. తప్పులు చెబుతూ వాటిని సరిదిద్దడం, విభేదాలతో విడిపోయిన వారిని కలపడం, నాలుగు గోడల మధ్య ఉన్న వీరికి వినోదం అందించడం చేస్తున్నారు. సందడిగా సాగుతూ వస్తున్న బిగ్ బాస్4 ఫినాలే డిసెంబర్ 30న భారీ లెవల్‌లో ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే నిర్వాహకులు అందుకు సంబంధించి ప్లాన్ చేస్తుండగా,ఈ ఫినాలేకు బడా స్టార్‌నే గెస్ట్‌గా తీసుకురానున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరై తన చేతుల మీదుగా రాహుల్ సిప్లిగంజ్‌కు ట్రోఫీ అందించారు. కాగా, ప్రస్తుతం హౌజ్‌లో ఎనిమిది మంది సభ్యులు ఉండగా, వారిలో అఖిల్ లేదా అభిజీత్‌లలో ఒకరు విన్నర్‌గా నిలుస్తారనే టాక్స్ వినిపిస్తున్నాయి.
 
ప్రస్తుతం షోలో అఖిల్ సర్తక్, అభిజీత్, సోహెల్, అరియానా, అవినాష్, లాస్యా, మోనాల్ గజ్జర్, హరికా ఉన్నారు. వాటిలో ఒకటి ఈ వారాంతంలో ఎలిమినేట్ అవుతుంది. మన చుట్టూ ఉన్న కరోనా భయాన్ని పరిగణనలోకి తీసుకుని షో నిర్వాహకులు ఈసారి టీవీ షో కోసం అతిథులను ఆహ్వానించకపోవచ్చుననే టాక్ కూడా వస్తోంది. ఇక ఎనిమిది మంది కంటిస్టెంట్స్‌లో ఐదుగురు ఫైనల్స్‌కు వెళ్లే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

చాయ్‌వాలా దేశ ప్రధానమంత్రి ఎలా అయ్యారు? సీఎం చంద్రబాబు ప్రశ్న

'ఈ పూటకు వెళ్లొద్దు... ఇంట్లోనే ఉండిపో నాన్నా' అని చెప్పినా వినలేదు.. చివరకు శాశ్వతంగా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments