ప్రతివారం ఒక కెప్టెన్ బిగ్ బాస్ షోలో ఉంటారు. ఇందులో అందరూ సమానంగా ఉండాలి. ఆడవాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ వారం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన పేరు చెప్పమని అరియానాను అడిగితే ఠక్కున ఆమె పేరే చెప్పుకుంది అరియానా. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఫైరవుతున్నారు. స్వార్థపరురాలు అరియానా అంటూ సందేశాలను పంపుతున్నారు.
తొమ్మిదో వారం కెప్టెన్సీ పోటీలో అమ్మరాజశేఖర్, అరియానా, హారికలు పోటీ పడ్డారు. రింగులో రంగు అనే టాస్కులో బాగానే ఆడారు ముగ్గురు. అయితే ఇందులో ఎవరో ఒక్కరే కదా అవ్వాలి కెప్టెన్. దీంతో అమ్మ రాజశేఖర్‌కు అరియానా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
హారికను ఇద్దరూ పూర్తిగా పక్కన పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇద్దరూ కలిసిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరిలో ఒకరే కెప్టెన్ అవుతారు. ముఖ్యంగా అమ్మరాజశేఖర్ అవుతారంటూ నెటిజన్లు సందేశాలు పంపుతున్నారు. కానీ అరియానా చేసిన పనికి మాత్రం మండిపడుతున్నారు. హారిక కెప్టెన్ అయ్యే అవకాశం లేదంటున్నారు.