Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయటకు వచ్చి బిగ్ బాస్‌ను అడ్డంగా బుక్ చేసిన మోనాల్ గజ్జర్

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (19:10 IST)
బిగ్ బాస్ 4 తెలుగు హౌస్ నుంచి తాజాగా బయటకు వచ్చిన నటి మోనాల్ గజ్జర్. ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా అభిజిత్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అతని అభిమానుల్లో మరింత కోపం తెప్పిస్తోంది. హౌస్‌లో అభిజిత్ తనతో ప్రవర్తించిన తీరు బాధాకరమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మోనాల్.
 
మోనాల్ గజ్జర్, అభిజిత్‌లు బిగ్ బాస్ హౌస్ ప్రేమికులు. అయితే ఒకానొక దశలో మోనాల్ హౌస్ లోనే ఉంటుందని అందరూ భావించారు. చివరలో విజేతగా నిలిచేది కూడా ఆమే అనుకున్నారు. కానీ ఆమె మాత్రం బయటకు వచ్చేసింది.
 
బయటకు వచ్చిన వెంటనే మోనాల్ కొంతమందితో మాట్లాడుతూ అభిజిత్ ఫ్యాన్స్ నా చెల్లెలు హేమాలికి కొన్ని మెసేజ్‌లు పంపారు. మీ అక్క చాలా తేడా చేస్తోంది. హౌస్‌లో టూమచ్‌గా ప్రవర్తిస్తోంది. నిన్ను, మీ అక్కను చంపేస్తామంటూ సందేశాలు పంపారు.
 
నా చెల్లి ఈ విషయాన్ని నాకు చెప్పింది. అయితే ఇదే విషయాన్నిహౌస్‌లో అభిజిత్‌ను ప్రశ్నించాను. నీ అభిమానులు నా చెల్లెలికి సందేశాలు పంపుతున్నారు. నువ్వు మన హౌస్ ద్వారా ఒక మెసేజ్‌ను పంపు. వారిని అలా చేయకూడదని చెప్పు అని రిక్వెస్ట్ చేశాను.
 
కానీ అభిజిత్ అందుకు ఒప్పుకోలేదు. అభిమానులంటే అలాగే ఉంటారు. వారు చెప్పే దాంట్లో తప్పేంటి అంటూ సమర్థించారు. అది చాలా కోపాన్ని తెప్పించింది అంటోంది మోనాల్. అందుకే నేను అభిజిత్ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది.
 
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వారిలో ఎవరూ కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. మోనాల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులను ఇరకాటంలో పెడుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్‌ను మరింత ఇరకాటంలో నెట్టేలా ఉందంటున్నారు విశ్లేషకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments