Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ సాయిపల్లవికి షాకిచ్చిన హైకోర్టు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (08:18 IST)
టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారించారు. దీన్ని గురువారం హైకోర్టు కొట్టివేసింది. 
 
దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం "విరాటపర్వం". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపిన ఘటనలను, ఇటీవల గోవులను తరలిస్తున్న డ్రైవర్ చంపిన ఘటనలను సాయిపల్లవి పోల్చుతూ మాట్లాడారు. 
 
ఈ వ్యాఖ్యలపై బజరంగ్‌దళ్, వీహచ్‌పీ సభ్యుడు అఖిల్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్‌ 21న పోలీసులు నోటీసులు జారీ చేయగా వీటిని సవాలు చేస్తూ సాయిపల్లవి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్‌ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. 
 
పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కాశ్మీర్‌ ఉగ్రవాదులతో గోసంరక్షులను పోల్చారంటూ ఫిర్యాదు ఇవ్వడం సరికాదని, మానవత్వంతో ఉండాలని మాత్రమే సాయిపల్లవి చెప్పారని అన్నారు. 
 
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, కేవలం వాస్తవాలను ధ్రువీకరించుకోవడానికే నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది టి.శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments