Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయి పల్లవికి ప్రకాష్ రాజ్ మద్దతు.. మేం మీ వెనుకే ఉన్నామంటూ..

prakash raj
, ఆదివారం, 19 జూన్ 2022 (10:13 IST)
ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ హీరోయిన్ సాయి పల్లవికి సినీ నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు ప్రకటించారు. తామంతా మీ వెనుకే ఉన్నామంటూ తన సంఘీభావాన్ని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సినీ ఫంక్షన్‌లో సాయిపల్లివి మాట్లాడుతూ, కాశ్మీర్ పండిట్స్, గోహత్యలపై వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర వివాదానికి దారితీశాయి. 
 
ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్‌మీడియా వేదికగా పలువురు నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. భజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందని, అందరి ప్రాణాలు ముఖ్యమేనని అన్నారు. 
 
మతం పేరుతో చేసే హింస మహాపాపమన్నారు. పైగా, తాను ఒక వైద్యురాలినని, మనిషి ప్రాణం విలువ తనకు బాగా తెలుసన్నారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంతమంది ఇలాంటి వార్తలు సృష్టించారని అన్నారు. 
 
కాగా, సాయిపల్లవి ఇచ్చిన వివరణపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌  స్పందించారు. ఆమెకు మద్దతుగా ఆయన ట్వీట్‌ చేశారు. 'మానవత్వమే అన్నింటికంటే ముందు.. కాబట్టి సాయిపల్లవి మేము నీతోనే ఉన్నాం' అని ఆయన రాసుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్యా’స్ ట్యుటోరియల్ వెబ్‌ సీరీస్‌లో దెయ్యం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌స్తే?