Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రా నరేష్‌కు ఊహించని షాక్.. ఆ ర్యాంక్ రాలేదట..!

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (09:44 IST)
సీనియర్ నటుడు, నరేష్ భార్య పవిత్రా నరేష్‌కు ఊహించని షాక్ ఎదురైంది. పీహెచ్డీ కోసం పవిత్ర  కన్నడ విశ్వవిద్యాలయం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET)లో ఉత్తీర్ణులయ్యారు. అయితే ఆ సంతోషం ఆమెకు కొంతకాలం కూడా నిలవలేదు. 
 
పవిత్ర లోకేష్ కొన్ని వారాల క్రితం పిహెచ్‌డి చేయడానికి బళ్లారిలోని హంపి కన్నడ విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఆమె ప్రియుడు నరేష్ పవిత్రని పరీక్ష కోసం యూనివర్సిటీకి తీసుకెళ్లాడు. కొన్ని వారాల క్రితం ప్రవేశ పరీక్ష జరిగింది. 
 
పవిత్ర కన్నడ సాహిత్యంలో పీహెచ్‌డీ చేసేందుకు ఈ పరీక్ష రాసింది. ఇటీవలే పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తీర్ణత సాధించినా యూనివర్శిటీలో సీటు రావడానికి కావాల్సిన ర్యాంక్ రాలేదు. దీంతో అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాలో పేరు లేదు. 
 
మాతృభాష సాహిత్యంలో పీహెచ్‌డీ చేయాలనే తన కల ఇప్పట్లో నెరవేరలేదని చెప్పింది. పవిత్ర లోకేష్ ఫలితాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పందించారు. పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత సాధించారు.
 
అయితే ఆమెకు సరైన ర్యాంక్ రాకపోవడంతో సీటు రాలేదన్నారు. దీంతో పవిత్ర కాస్త నిరాశకు లోనైంది. అయితే ఆమెకు పీహెచ్‌డీ చేసే అవకాశం ఇంకోసారి వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా!!

వైకాపా ఓడిపోవడానికి కారణం అదే ... పవన్‌ది డైనమిక్ పాత్ర : సీపీఐ నారాయణ

మిస్సింగ్ అమ్మాయిలను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగం : డిప్యూటీ సీఎం పవన్

ప్రజావాణికి మంచి రెస్పాన్స్.. దరఖాస్తుల వెల్లువ

సినిమా విలన్ సీన్లను తలపించేలా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ శైలి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments