సీనియర్ నటుడు శరత్ బాబు (71) సోమవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అయన శ్వాస సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చికిత్సా పొందుతున్నారు. హైద్రాబాద్లో సీనియర్ నరేష్ నటించిన మల్లి పెళ్లి డబ్బింగ్ ఇటీవలే చెప్పారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించలేదు. ఆయన గతంలో రమాప్రభను వివాహం చేసుకున్నారు. కొంతకాలం తరువాత విడిపోయారు. మల్లి పెళ్లి ప్రీరిలీజ్ లో నరేష్ మాట్లాడుతూ, శరత్ బాబు పాత్ర చాలా హైలెట్ అవుతుందని అన్నారు. ఆరోగ్యం బాగోలేక ఫంక్షన్ కు రాలేక పోయారని గుర్తు చేశారు.
చెన్నయ్ లో నివాసం ఉండే శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శ్రీకాకుళం ఆముదాలవలస ఆయన పుట్టిన ఊరు. 1971లో రామరాజ్యం సీనియాలో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. సీతాకోక చిలుక, సాగర సంగమం తో పాటు ఎన్నో సినిమాల్లో నటించారు. హీరో, విలన్, క్యారెక్టర్ నటుడిగా చేశారు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. ఈ సంధర్బంగా మూవీ ఆర్టిస్త్ అసోసియేషన్ సంతాపాన్ని ప్రకటించింది.