Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం, అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్..!

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (20:04 IST)
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పైన ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమాల మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చిన కేదార్ భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేయబోతున్నారు.
 
 అందులో భాగంగా తన మొదటి సినిమాను స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌లతో చేయబోతున్నట్టు తన పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. "ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్ గార్ల తో నా మొదటి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. 
 
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఈ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి. విజయ్, సుకుమార్‌లిద్దరూ కొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళ సినిమాలు కుడా అలాగే ఉంటాయి. వాళ్ళిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్లోనే ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం." అని ఈ చిత్ర నిర్మాత కేదార్ అన్నారు.
 
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫైటర్ మూవీ చేస్తున్నాడు. సుకుమార్ పుష్ప మూవీ చేస్తున్నాడు. విజయ్ మరో సినిమా చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments