Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెప్పిన నిర్మాణ సంస్థ

Advertiesment
Production company
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (20:05 IST)
హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని పలువురు హీరోయిన్లను అప్రోచ్ అయి వేధించిన తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్టైన్మెంట్స్ తన తప్పును తెలుసుకుంది. హీరో విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది. తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ ఇలా చేసిందనీ, వాళ్లమీద వెంటనే చర్యలు తీసుకుంటామనీ, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని పేర్కొంది.
 
విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని పలువురు హీరోయిన్లను అప్రోచ్ అయింది డస్కీ ఎంటర్టైన్మెంట్స్. విజయ్ మాకు సైన్ చేశాడనీ, మీరు కూడా ఒప్పుకోవాలని కాల్స్ చేసి వేధించారు. కొందరు హీరోయిన్లు నిజమా కాదా అని చెక్ చేసుకునేందుకు విజయ్ టీమ్‌ను అప్రోచ్ అయ్యారు. ఇంతకుముందు కూడా కొందరు విజయ్ పేరు చెప్పి ఆడిషన్స్ నిర్వహించడం వల్ల టీమ్ విజయ్ దేవరకొండ హెడ్ అనురాగ్ పర్వతనేని వెంటనే అలెర్ట్ అయ్యారు.
 
కోలీవుడ్, టాలీవుడ్‌లో ఉన్న కాస్టింగ్ మేనేజర్లందరికీ ఫోన్లు చేసి అది ఫేక్ అని చెప్పారు. తాము ఎలాంటి సంస్థకు సైన్ చేయలేదనీ, ఇలాంటివి నమ్మి మోసపోవద్దని మీడియాకు కూడా ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా డస్కీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్లను కాంటాక్ట్ అయి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెంటనే తమ తప్పును తెలుసుకున్న ఆ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెప్పి దీనికి కారణమైన పలువురి ఉద్యోగుల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.
 
విజయ్ దేవరకొండకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నిజానికి స్టార్ హీరోలకు ఇలాంటివి మామూలే.. కానీ హీరోల పేరు చెప్పగానే కొందరు నటీనటులు నమ్మి ఫేక్ నిర్మాణ సంస్థల చేతిలో మోసపోతుంటారు. అందుకే ఈ ఇష్యూని లైట్‌గా తీసుకోకుండా విజయ్ టీమ్ చాకచక్యంగా సాల్వ్ చేసింది. ఈ విషయంలో వాళ్లను అభినందిచాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా లవ్ మేటర్ ఇప్పుడు చెప్పను, త‌మిళంలో నన్ను స‌రిగ్గా ప్రొజ‌క్ట్ చేయ‌లేదు: విద్యుల్లేఖ