Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ మా టీవీ బిగ్ బాస్ 3 ప్రొమో రిలీజ్... ఆ ముసుగు వేసుకుని వెళ్లింది నాగార్జునా?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (19:34 IST)
ఇప్పుడు టీవీ ప్రొగ్రామ్స్ బాగా ఫాలో అయ్యేవారు జ‌పిస్తున్న‌.. త‌పిస్తున్న ప్రొగ్రామ్ బిగ్ బాస్ 3. బిగ్ బాస్ 1కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హాస్ట్‌గా చేస్తే… బిగ్ బాస్ 2కి నేచుర‌ల్ స్టార్ నాని హాస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం తెలిసిందే. దీంతో బిగ్ బాస్ 3కి హాస్ట్ ఎవ‌రు అనేది ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే… బిగ్ బాస్ 3 హోస్ట్ ఇత‌నే అంటూ నాగార్జున పేరు ఎక్కువుగా వినిపిస్తోంది. 
 
అలాగే  వెంక‌టేష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌… ఇలా కొంతమంది పేర్లు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు మా టీవీ యాజ‌మాన్యం అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు.
 
స్టార్ మాటీవీ సోష‌ల్ మీడియా ద్వారా అధికారంతో న‌డిపే శ‌క్తి గ‌ల వ్య‌క్తి ఎవ‌రు అంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు. అందులో ఓ స్వామిజీ భ‌క్తుల‌తో మాట్లాడుతూ… మ‌న‌సు కోతి లాంటిది. అలాంటి మ‌న‌సున్న మ‌నుషులు ఓ ఇంట్లో చేరితే..? మ‌మ‌కారంతో.. వెట‌కారంతో వారిని ఏక‌తాటి పైకి తెచ్చేది ఎవ‌రు..? అధికారంతో న‌డిపేది ఎవ‌రు..?
 
ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శ‌క్తిగ‌ల వారు ఎవ‌రు..? అని చెబుతుంటే… ముసుగు వేసుకున్న ఆ వ్య‌క్తి న‌డిచి వెళుతుంటాడు. అంతే... బిగ్ బాస్ 3 త్వ‌ర‌లో అని చెప్పారు కానీ.. హోస్ట్ ఎవ‌రు అనేది మాత్రం చెప్ప‌లేదు. దీంతో ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున లేక వేరే హీరోనా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments