Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 3లో కొత్త ట్విస్ట్...హోస్ట్‌గా తెరమీదకు మరో కొత్త పేరు

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (18:08 IST)
బిగ్ బాస్ 3 ప్రారంభానికి ముందే అనేక ట్విస్ట్‌లు, ఊహాగానాలతో ముందుకు సాగుతోంది... బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా రోజుకో కొత్త పేరు తెరమీదకు వస్తోంది. రాజమౌళితో తాజాగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో హోస్ట్‌గా వ్యవహరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ నిరాకరించడంతో...‘స్టార్ మా’ యాజమాన్యం అక్కినేని నాగార్జునని సంప్రదించినట్లు గత వారం కథనాలు వెలువడ్డాయి. 
 
గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా బుల్లి తెరని ఒక ఊపు ఊపిన కింగ్... బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా దాదాపు ఖరారైపోయినట్లు కూడా మీడియా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త పేరు హోస్ట్‌గా తెరమీదకు వచ్చింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండను హోస్ట్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సూపర్ హిట్ సినిమాలతో... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. అందుకే ఆయనను బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా ఒప్పించేందుకు స్టార్ మా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
విజయ్ దేవరకొండ డేట్స్ కుదరకపోతే మాత్రం నాగార్జుననే ఖరారు చేసుకోవాలని బిగ్ బాస్ 3 నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షోలో హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునకు, ఆ అనుభవం కూడా బిగ్ బాస్ 3లో కలిసి వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట.
 
ఇప్పటికే... బిగ్ బాస్ 1కి జూనియర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ 2కి నానీ హోస్ట్‌లుగా వ్యవహరించారు. బిగ్ బాస్ 3లో వీరిద్దరికి ధీటైన స్థాయి హీరోని హోస్ట్‌గా పెట్టుకుంటే షోకి పాపులారిటీ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ 2 ముగిసి ఇప్పటికే 10 మాసాలు గడిచిపోయిన నేపథ్యంలో... వీలైనంత త్వరగా హోస్ట్‌ని ఫైనల్ చేసి, సదరు షోను మొదలుపెట్టేయాలని భావిస్తున్నారట. 
 
విజయ్ దేవరకొండ లేదా నాగార్జునలో ఎవరో ఒక్కరు బిగ్ బాస్ 3 హోస్ట్‌గా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హోస్ట్ ఖరారైనట్లయితే, జూలై నుండే బిగ్ బాస్ 3ని ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. మరి... కంటెస్టెంట్‌లు ఎవరో... అది ఎప్పుడు ఖరారవుతుందో...

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments