Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింగుసామి సూచ‌న‌లు పాటిస్తున్న భార‌తీరాజా

Webdunia
శనివారం, 17 జులై 2021 (19:14 IST)
Ram-bharatiraja-linguswami
ఉస్తాద్ రామ్ న‌టిస్తోన్న తాజా సినిమా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోంది. హీరోయిన్ కృతీ శెట్టి, నదియా కూడా న‌టిస్తున్నారు. ఇందులో భారతీరాజా కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. శ‌నివారం భార‌తీరాజా పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ షూటింగ్ పేక‌ప్ అనంత‌రం కేక్‌ను క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.

షూటింగ్‌లో భార‌తీరాజా త‌ను ద‌ర్శ‌కుడు అయినా లింగుసామి చెప్పింది తూచ‌. పాటిస్తూ న‌టిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. మోనిట‌ర్‌ను చూస్తూ ఏదైనా మార్ప‌లు వుంటే మ‌ర‌లా చేయ‌డానికి ఆయ‌న స‌మ్మ‌తించ‌డం విశేషం. ఓ సీన్ విష‌యంలో ఇలా చేయాలంటూ భార‌తీరాజాకూ చూపిస్తూ చేయించాడు లింగుసామి.
 
ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌లే త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూడా అక్క‌డే వుండ‌డంతో లింగుసామి చిత్రం చూడ‌డానికి విచ్చేశారు. దీనితో ఈ సినిమాపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్ర‌సాద్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. ఇదిలా వుండ‌గా, భారతీరాజా చేసిన‌ సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. అంతేకాకుండా ఆయ‌న మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments