Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ప్రియులకు శుభవార్త : 18 నుంచి థియేటర్లలో బొమ్మ

Webdunia
శనివారం, 17 జులై 2021 (19:06 IST)
తెలంగాణా రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. గత కొద్ది నెల‌ల నుంచి మూత‌పడివున్న సినిమా థియేటర్లు తెలంగాణాలో తెరుచుకోనున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి కొత్త సినిమాలు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో రేప‌టి నుంచి థియేట‌ర్ల‌ను తెర‌వాల‌ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ నిర్ణ‌యించింది. 
 
ఈ మేర‌కు తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్రెసిడెంట్ ముర‌ళీమోహ‌న్, సెక్ర‌ట‌రీ సునీల్ నారంగ్.. ఎగ్జిబిట‌ర్ల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసి థియేట‌ర్ల ఓపెన్‌పై నిర్ణ‌యం తీసుకున్నారు. సినిమా థియేట‌ర్ల‌లో ప‌ని చేసే సిబ్బంది ఇబ్బందుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నామ‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు తెలిపారు.
 
ఈ భేటీ కంటే ముందు సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు స‌మావేశం అయ్యారు. మంత్రిని క‌లిసిన వారిలో సునీల్ నారంగ్, అనుప‌మ్ రెడ్డి, కిశోర్ బాబు, అభిషేక్ నామా, బాల గోవింద‌రాజు స‌మావేశం అయ్యారు. థియేట‌ర్ల‌కు ప్ర‌క‌టించిన రాయితీల‌పై ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని వారు మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments