Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాటి మనిషిని బానిసలాగా చూడాలంటే నీ గుండెలదరాలి' : భైరవగీత ట్రైలర్

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:56 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పిస్తున్న తాజా చిత్రం భైరవగీత. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో ఆలోచనను ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలా? ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేస్తే సరిపోద్ది అయ్యా.. అనే డైలాగ్ సినిమా ఎలా ఉండ‌నుందో తెలుపుతుంది. 
 
తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించకపోయినా.. సిద్ధార్థ్‌కు అన్నివిధాలా సహకరించినట్లు ఈ ట్రైలర్ చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. గతంలో ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాలు పెంచిన యూనిట్‌, తాజాగా మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేసి మ‌రింత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చేలా చేశారు. 
 
ఈ చిత్రాన్ని యధార్థ ఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ ప్రేమ క‌థ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. 'మనుషులను బానిసలుగా చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో దింపే కత్తే దీనికి సమాధానం' అంటూ ఫ్యాక్షన్ పెద్దలపై తిరుగుబాటును కూడా ఈ ట్రైలర్లో చూపించారు. 
 
'సాటి మనుషులను బానిసలుగా చూడాలంటే నీ గుండెలు అదరాలి' అంటూ ముగించి సినిమాలపై అంచనాలు పెంచారు. ఈ సినిమా ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments