Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ 'సర్కార్'షోకు షాకిచ్చిన తమిళ సర్కార్...

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (11:36 IST)
తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం "సర్కార్". ఈ చిత్రం ఈనె ఆరో తేదీన విడుదల కావాల్సి ఉంది. ఆ రోజుతో పాటు 7, 8, 9 తేదీల్లో ప్రత్యేక షోలకు అనుమతి కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్ర దర్శకనిర్మాతలు విజ్ఞప్తి చేశారు. కానీ, ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి నిరాకరించింది. ఈ నాలుగు రోజుల పాటు కేవలం రెగ్యులర్ షోలతో పాటు ఒక్క ఆటను మాత్రం అదనంగా ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. 
 
కాగా, ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా, హీరో విజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీంతో ఈ చిత్రం స్పెషల్‌ షోలకు అనుమతి నిరాకరించింది. అయితే తమిళనాడు చలనచిత్ర పంపిణీదారుల సంఘం విజ్ఞప్తి మేరకు దీపావళి రోజుతోపాటు 7, 8, 9 తేదీలలో థియేటర్లలో ఒక్క స్పెషల్‌ షోకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం జీవో విడుదలైంది. 
 
ఈ ప్రకారం ఒకరోజు కేవలం ఐదు షోల ప్రదర్శనకు మాత్రమే వీలవుతుంది. సాధారణంగా విజయ్‌ వంటి అగ్రహీరోల సినిమాలు విడుదలైతే తొలివారంలో ఆరు లేదా ఏడు షోలు వేస్తుంటారు. గతంలో ప్రభుత్వం కూడా అందుకు అనుమతిచ్చేది. కానీ, ఇప్పుడు 'సర్కార్'కు ఆ అవకాశం లేదు. 4 రెగ్యులర్‌ షోలు, ఒక స్పెషల్‌ షోతో కలిపి ఐదు షోలకు మాత్రమే వీలవుతుంది. అది కూడా నాలుగు రోజులు మాత్రమే. ఇది కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments