Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో భగవంత్ కేసరి థియేట్రికల్ ట్రైలర్ రాబోతుంది

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (18:58 IST)
Balakrishna
నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ మేకర్స్ ప్రమోషన్స్ లో  టీజర్ నుంచి పాటల వరకు మ్యాసివ్ బజ్‌ని సృష్టించాయి. ఇప్పుడు, సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం ఆసన్నమైంది. అక్టోబర్ 8న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. పోస్టర్‌లో బాలకృష్ణ చేతిలో కర్రతో కుర్చీపై కూర్చున్న విజువల్ కనిపిస్తుంది. బాలకృష్ణ ఇంటెన్స్ గా చూస్తుండగా, అతని వెనుక పోలీసు అధికారులు నిలబడి ఉన్నారు. మాస్, యాక్షన్ అంశాలతో పాటు, సినిమాలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి.
 
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
 సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
 
ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments