Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని జీవన సాఫల్య అవార్డుకు భగీరథ ఎంపిక

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:43 IST)
Akkineni-bhageeradha
పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరావు పేరిట శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసిన ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య  పురస్కారానికి ఈ సంవత్సరం సీనియర్ పాత్రికేయుడు భగీరథ ను  ఎంపిక చేశామని అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు.
 
శృతిలయ ఆర్ట్స్ అకాడమీ గత రెండు దశాబ్దాలుగా ప్రతి నెల హైదరాబాద్ రవీంద్రభారతి లో సినీ సంగీత విభావరి లు నిర్వహిస్తూ ఎందరో సినీ ప్రముఖులను, సేవా మూర్తులను సత్కరిస్తూ యువతరానికి స్ఫూర్తినిస్తోందని , ఈ సంస్థ నిర్వాహకురాలు, గాయకురాలు  శ్రీమతి ఆమని తెలంగాణ ప్రభుత్వ  బిసి సంక్షేమ శాఖ లో ఉన్నతాధికారిణిగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు .     
2001వ సంవత్సరంలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ ను డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు  రవీంద్రభారతి  ప్రారంభించారని, అందుచేత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట వారి పుట్టిన రోజు సెప్టెంబర్ 20న పాత్రికేయులను సత్కరిస్తూ వస్తున్నామని, ఈ ఏడాది అక్కినేని శృతిలయ ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం కోసం, సినిమా పాత్రికేయునిగా  నాలుగు దశాబ్దాల అనుభవం, ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ భగీరథ గారిని ఎంపిక చేయడం జరిగిందని మహ్మద్ రఫీ తెలిపారు. 
ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగే అక్కినేని జయంతి ఉత్సవాల్లో భగీరథ గారిని సత్కరించి అక్కినేని జీవన సాఫల్య అవార్డును ప్రదానం చేస్తామని డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments