Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర నటి సెల్ఫీ సూసైడ్ వీడియో.. యువకుడి చేతిలో మోసపోయాను..

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (12:54 IST)
Kannada Actress
సినిమాల్లో రాణించాలనే కలలతో వచ్చిన ఓ యువతి ప్రేమ పేరుతో మోసపోయింది. పల్లె నుంచి పట్నానికి వచ్చి తన కలనెరవేరకుండానే ఆత్మహత్యకు పాల్పడింది. ఓ యువకుడి చేతిలో మోసపోయానని సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సినిమాల్లో నటించాలన్న కల నెరవేరకుండానే కన్నుమూసింది. 
 
వివరాల్లోకి కర్ణాటక రాష్ట్రం హాసన్‌ జిల్లా బేలూరుకు చెందిన చందన సినిమాల్లో నటించాలని కోరికతో బెంగళూరుకు వచ్చింది. కన్నడ బుల్లితెరతో పాటు పలు ప్రకటనలు, సినిమాలో చిన్నచిన్న పాత్రల్లో ఆమె నటించింది. ఇంతలో ఓ వంచకుడి కన్ను చందనపై పడింది. ప్రేమ పేరుతో తీయని మాటలు చెప్పి ఐదేళ్లు మోజు తీర్చుకున్నాడు. తీరా పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో జరిగిన మోసానికి కుంగిపోయిన ఆ అభాగ్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.
 
విషాన్ని తాగుతూ తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియోలో చెప్పింది. ప్రియుడు దినేశ్‌ చేసిన మోసాలను ఏకరవుపెట్టిన చందన సెల్ఫీ వీడియోలో బోరుమంది. చందన తీసిన సెల్ఫీ వీడియో ఆధారంగా నిందితుడు దినేష్‌పై కర్నాటక పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో దినేశ్‌ పరారీలో ఉన్న నిందితుడు దినేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments