కారు ప్రమాదంలో కన్నుమూసిన వర్థమాన నటి

బుధవారం, 27 మే 2020 (14:28 IST)
కరోనా వైరస్ లాక్డౌన్ ఎంతోమంది జీవితాలను బలి తీసుకుంటోంది. 22 ఏళ్ల కన్నడ నటి మెబియానా మైఖేల్ కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణంతో కన్నడ చిత్ర, టెలివిజన్ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

మెబియానా మైఖేల్ స్నేహితులతో కలిసి బెంగళూరు నుండి తన స్వస్థలమైన మాడికేరికి కారులో ప్రయాణిస్తుండగా, వారి వాహనం అనుకోకుండా దేవిహల్లి వద్ద మలుపులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
 
దీంతో కారులో ఉన్న వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె స్నేహితులు చికిత్స పొందుతుండగా మెబియానా తీవ్ర గాయాల కారణంగా కన్నుమూసింది. కన్నడ రియాలిటీ షో 'ప్యతే హుదుగిర్ హల్లి లైఫ్' సీజన్ 4 ద్వారా టెలివిజన్‌లోకి ప్రవేశించడానికి ముందు మెబియానా మైఖేల్ కొన్ని సంవత్సరాలు మోడలింగ్‌లో ఉన్నారు.
 
ఆమె కొన్ని సీరియళ్లతో పాటు సినిమాల్లో నటించడానికి చర్చలు జరుపుతున్నారు. ఐతే దురదృష్టవశాత్తు ఆమె జీవితం కారు ప్రమాదం రూపంలో ముగిసిపోయింది.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజమౌళి 'రామాయణం'లో రాముడుగా మహేష్... ఇలా ఉంటాడేమో?!