Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ నన్ను వేరేగా చూస్తే మాత్రం నాకు తిక్కరేగుద్ది (video)

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (10:50 IST)
balakrishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి, తెలంగాణ సీఎం, మంత్రులతో సినీ పెద్దలు జరిపిన చర్చలపై బాలయ్య సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తనను ఎవరూ పిలవలేదన్నారు. కానీ భూములు పంచుకోవడానికా.. ఆ సమావేశం అన్నట్లు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం రేపాయి. అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. 
 
సినీ పెద్దల మీటింగ్‌కు ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించడంలో తప్పు లేదని, అయితే భూములు పంచుకున్నారని అనడం మాత్రం సరైంది కాదని నాగబాబు చెప్పారు. సినీ పరిశ్రమ అంటే ఎన్టీఆర్, చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే కాదని, వీళ్ళతో పాటు ఏఎన్నార్, కృష్ణ కుటుంబాలతో పాటు మరికొన్ని ఫ్యామిలీలు ఉన్నాయని అన్నారు. మీటింగ్‌కు, ఫ్యామిలీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. 
 
అయితే తాజాగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఆ విషయం పై స్పందించారు. ఇంటర్వ్యూలో నాగబాబు వ్యాఖ్యలపై మీరేమంటారు? అని ప్రశ్నించగా "ఛీ, ఛీ... నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?"  అంటూ బాలకృష్ణ సమాధానమిచ్చాడు. 
 
అంతేగాకుండా.. కేసీఆర్‌పై గతంలో చేసిన విమర్శల కారణంగా తనను పిలవలేదనుకోననని బాలయ్య అన్నారు. ఇంకా కేసీఆర్‌తో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. "కేసీఆర్‌ గారికి నామీదేం కోపం లేదు.. అయినా అవి రాజకీయాలు, రాజకీయ విమర్శలు.. అప్పుడు కేసీఆర్ ను ఎన్నో తిట్లు తిట్టిన నామా నాగేశ్వరరావుగారిని పార్టీలో జాయిన్ చేసుకోలా? రాజకీయాలు వేరండి.. అంటూ బాలయ్య కామెంట్స్ చేశారు. 
 
ఇంకా కేసీఆర్ గురించి బాలయ్య మాట్లాడుతూ.. "హిపోక్రసి, సైకోఫాన్సీ అని.. కేసీఆర్‌ గారికి అటువంటిది ఏమీ లేదు.. రామారావుగారి అభిమాని ఆయన.. నేనంటే పుత్రవాత్సల్యం ఉంది ఆయనకి.. కానీ నన్ను వేరేగా చూస్తే మాత్రం నాకు తిక్కరేగుద్ది.. ఎందుకు పిలవలేదో నాకు తెలియదు'' అని బాలయ్య వ్యాఖ్యానించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments