Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ ఘాట్ వద్దకెళ్లిన పూనమ్ కౌర్.. ట్వీట్ వైరల్.. దుష్ట శక్తులంటే? (video)

Advertiesment
ఎన్టీఆర్ ఘాట్ వద్దకెళ్లిన పూనమ్ కౌర్.. ట్వీట్ వైరల్.. దుష్ట శక్తులంటే? (video)
, శుక్రవారం, 29 మే 2020 (10:32 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ జయంతిని ఆయన సొంత మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్ ఇంటే వద్దే జరుపుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ భావోద్వేగ ట్వీట్‌తో తన తాతకు ఘన నివాళి అర్పించారు. అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్దకెళ్లి హీరోయిన్ పూనమ్ కౌర్ నివాళి అర్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
అంతటితో ఆగకుండా ఆమె చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్‌తో పూనమ్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా ఉండటమే ఆమెకున్న ఏకైక అనుబంధం. ఎన్టీఆర్‌ను కులాలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా అభిమానిస్తారు. సినీ కుటుంబ సభ్యురాలిగా ఎన్టీఆర్‌ను పూనమ్ స్మరించుకున్నారని అభిమానులు సరిపెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
 
''తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆరాధ్య దేవుడు. స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్నిచ్చేలా దీవించండి. మానవత్వం బొత్తిగా కరవైన ఈ రోజుల్లో మీ వంటి నేతలు, మీ వంటి నటుల అవసరం ఎంతో ఉంది'' అని తీవ్ర భావోద్వేగంతో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. పూనమ్ కౌర్ ట్వీట్‌పై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దుష్ట శక్తులంటే ఎవరి గురించి అనే ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం పూనమ్ కౌర్ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌కు ఆ సినిమా నచ్చలేదట