అభిషేక్ ఛటర్జీ మృతి.. 100కి పైగా సినిమాల్లో నటించి తిరిగి రాని లోకాలకు..?

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (13:38 IST)
Abhishek Chatterjee
సీనియర్ నటుడు అభిషేక్ ఛటర్జీ అనారోగ్యంతో మృతి చెందారు. చాలా డిమాండ్ ఉన్న కారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అభిషేక్ మృతితో బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
బెంగాలిలో 100కి పైగా సినిమాల్లో నటించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో మార్చ్ 24 ఉదయం కన్నుమూశారు. 1985లో పాత్‌భోలా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు అభిషేక్ ఛటర్జీ. అక్కడ్నుంచి ఎన్నో సినిమాల్లో నటించారు. 
 
ముఖ్యంగా ఓరా చార్జోన్, తుమీ కోటో సుందర్, సురర్ ఆకాశే, తూఫాన్, మర్యాద, అమర్ ప్రేమ్ లాంటి సినిమాల్లో అభిషేక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 
 
టీవీలో కూడా తనదైన ముద్ర వేసాడు అభిషేక్ ఛటర్జీ. ఎన్నో వందల సినిమాల్లో అలరించిన నటుడు కళ్ల ముందు లేడనే విషయాన్ని తెలుసుకుని బాధపడుతున్నారు అభిమానులు. బెంగాలీ నటీనటులు, టెక్నీషియన్స్ కూడా అభిషేక్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments