Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ : ఛత్రపతిని రీమేక్ చేయనున్న వివివినాయక్

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (11:51 IST)
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇపుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. లోగడ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చి సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఛత్రపతి చిత్రం రీమేక్‌తో ఆయన హిందీ వెండితెరకు పరిచయంకానున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివివినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. 
 
ముఖ్యంగా, హిందీ సినీ ప్రేక్షకులను ఆక‌ట్టుకునేలా స్క్రిప్ట్ వ‌ర్క్‌ను ప్రముఖ కథా రచయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మార్పులు చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. ప్ర‌ధానంగా చిత్రం రెండో భాగంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో మార్పులు చేయ‌నున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కించనున్నారు. 
 
ఈ మూవీని ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెయిన్ ఇండియా రీమేక్ నిర్మాణ బాధ్య‌త‌లు తీసుకోనుంది. ఛ‌త్ర‌పతి రీమేక్‌ని ఎవ‌రు తెర‌కెక్కిస్తారు అని అంద‌రిలో ఆతృత నెల‌కొన్న స‌మ‌యంలో కొద్ది సేప‌టి క్రితం చిత్ర బృందం ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పుకొచ్చింది. 
 
మాస్ డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మాస్ డైరెక్ట‌ర్‌తో క‌లిసి మాస్ హీరో చేయ‌నున్న ఈ రీమేక్ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని త‌ప్ప‌క షేక్ చేస్తుంద‌ని అంటున్నారు. 
 
విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌నందించిన య‌మ‌దొంగ‌, మ‌గ‌ధీర‌, బాహుబ‌లి.. ది బిగినింగ్‌, బాహుబ‌లి.. ది క‌న్‌క్లూజ‌న్‌, భ‌జ‌రంగీభాయ్ జాన్ వంటి చిత్రాలు భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌రికొత్త  చ‌రిత్ర సృష్టించ‌డంతో తాజా రీమేక్‌పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments