Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌తో బ్యాట్‌ లవర్స్‌

Webdunia
సోమవారం, 12 జులై 2021 (15:53 IST)
Bat lovers team
మణి సాయితేజ‌, హాసిని రాయ్‌ జంటగా మాక్‌ఉడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఎ.రాబిన్‌ నాయుడు దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్‌ నిర్మిస్తోన్న చిత్రం 'బ్యాట్‌ లవర్స్‌'. ఈ సినిమాను టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ విడుదల చేశారు.
 
సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ "క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం. అందరూ కొత్తవాళ్లతోనే సినిమాను రూపొందించారు. నిర్మాత ఉపేందర్‌ తన కొడుకు మణిసాయిని హీరోగా పరిచయం చేస్తూ సినిమాను నిర్మించారు. డైరెక్టర్‌ రాబిన్‌కు సినిమా మంచి పేరు తేవాలి. అలాగే మణిసాయి హీరోగా సక్సెస్‌ కావాలి. టీజర్‌ చాలా బావుంది. కేవలం క్రికెట్‌ అనే కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌ను కూడా మిక్స్‌ చేసి చేశారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న హాసిని రాయ్‌ మంచి పేరు తెచ్చుకోవాలి. క్రికెట్‌ అనేది ఎంత పాపులారో 'బ్యాట్‌లవర్‌' కూడా అంతే ఫేమస్‌ కావాలి. ఎంటైర్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌" అన్నారు. 
 
నిర్మాత ఉపేందర్‌ మాట్లాడుతూ, డైరెక్టర్‌ రాబిన్‌ క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌తో అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్‌ చేస్తూ సినిమాను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశాం. అందరూ మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అన్నారు. 
 
డైరెక్టర్‌ ఎ.రాబిన్‌ నాయుడు మాట్లాడుతూ, టీజర్‌ విడుదల చేసి మా యూనిట్‌ను ఎంకరేజ్‌ చేసిన కళ్యాణ్‌గారికి స్పెషల్‌ థాంక్స్‌. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. మా సినిమాను ప్రేక్షకులు చూసి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు. 
 
హీరోయిన్‌ హాసిని రాయ్‌ మాట్లాడుతూ "హీరోయిన్‌గా తొలి చిత్రమిది. మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను. ఉపేందర్‌గారు సపోర్ట్‌తో సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్‌ రాబిన్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. మా టీమ్‌ను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments