Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరవైయేళ్ల సావిత్రికి పాతికేళ్ల సత్యమూర్తి భ‌ర్త‌యితే?

Advertiesment
అరవైయేళ్ల  సావిత్రికి  పాతికేళ్ల సత్యమూర్తి భ‌ర్త‌యితే?
, సోమవారం, 12 జులై 2021 (15:34 IST)
Srilakshmi, Parvatisham
అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం కలిసుండాలని ఎలా నిర్ణయించుకున్నారు? అనే కథాంశంతో రూపొందుతున్న స్వచ్ఛమైన వినోదాత్మక కుటుంబకథా చిత్రం 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. పాతికేళ్ల కుర్రాడిగా పార్వతీశం ('కేరింత' ఫేమ్, నూకరాజుగా నటించిన హీరో), అతని భార్య పాత్రలో అరవైయేళ్ల మహిళగా హాస్యనటి శ్రీలక్ష్మి వెండితెరపై సందడి చేయనున్నారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు మూడో వారంలో విడుదల  చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ "కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రమిది. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాం. త్వరలో వాళ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. హైదరాబాద్, అరకు, ఈస్ట్ గోదావరి, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 45 రోజులు చిత్రీకరణ చేశాం. విశాఖలో గుమ్మడికాయ కొట్టేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి ఆగస్టు మూడో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్ని వర్గాలను, అన్ని వయసుల వాళ్లను అలరించే చిత్రమిది" అని అన్నారు.
 
శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఎల్లారెడ్డి, ఎడిటర్: మహేష్, మ్యూజిక్ డైరెక్టర్: సత్య కశ్యప్, లిరిక్స్ - రాంబాబు గోశాల , సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల, ప్రొడ్యూసర్: గోగుల నరేంద్ర, కథ - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్: చైతన్య కొండ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌టుడు సుమన్‌కు లెజెండ్ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్