Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలీ భాయ్ నువ్వు ఎప్పుడు సూపర్‌స్టారే- సోనూసుద్‌

అలీ భాయ్ నువ్వు ఎప్పుడు సూపర్‌స్టారే- సోనూసుద్‌
, సోమవారం, 12 జులై 2021 (15:46 IST)
Ali cinema poster
నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.   అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలోని రెండో పాటను ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త సోనూసుద్‌ విడుదల చేశారు.
 
తర్వాత ఆయన మాట్లాడుతూ, అలీ గారు అనేక సినిమాలు చేసి సినిమా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. అలీ, నేను పూరిగారు డైరెక్ట్‌ చేసిన ‘‘సూపర్‌’’ సినిమా సమయం నుండే మంచి స్నేహితులం. అలీ సెట్లో ఉంటే ఎంతో సందడిగా ఉండేది. ఆయన అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌  అనే బ్యానర్‌ని పెట్టి సినిమాలు తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్‌ పేరు ‘‘అలీవుడ్‌’’ రాకింగ్‌గా ఉంది. ఈ సినిమాలోని‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’ టైటిల్‌ సాంగ్‌ను నేను విడుదల చేయటం ఆనందంగా ఉంది. అలీ భాయ్‌ నువ్వెప్పుడు సూపర్‌స్టారే, లవ్‌ యూ’’ అన్నారు. 
 
అలీ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ఏ సాయం కావాలన్నా దేశం మొత్తం ఒక వ్యక్తి వైపే చూస్తుంది. అందుకే మా సినిమాకి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ అందరూ బావుండాలి, అందులో నేనుండాలి’’ అనే పాటను అందరూ బావుండాలి అని కోరుకునే వ్యక్తితో విడుదల చేయిస్తే బావుంటుంది అనుకుని సోనూసుద్‌ని అడిగాను. నా సినిమా టైటిల్‌సాంగ్‌ మీరు విడుదల చేయాలి అని అడగ్గానే తను ఎంతో బిజిగా ఉన్నా వెంటనే ఒప్పుకుని పాటను విడుదల చేశారు. సోనూసుద్‌ విడుదల చేసిన ఈ పాటను తన ఫ్యాన్స్, తనద్వారా సాయం పొందిన ఎన్నో కుటుంబాలు పాడుకుంటాయి. సోనూకు అభినందనలు. ప్రజలందరూ ఎంతో ఇష్టంగా ఈ పాటను పాడుకుంటారు. నాకు నమ్మకం ఉంది’’ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరవైయేళ్ల సావిత్రికి పాతికేళ్ల సత్యమూర్తి భ‌ర్త‌యితే?