Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నివాస్, విద్య మాధురి నిర్మాత‌లుగా నూత‌న చిత్రం ప్రారంభం..

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (12:32 IST)
జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాణంలో పూర్తిగా కథ ప్రధానంగా సాగే చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు మొద‌లుపెట్టారు. గురువారం హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు బన్నీ వాస్ త‌న‌య‌ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. 
 
ఈ సినిమాకు బ‌న్నివాసుతో పాటు విద్య మాధురి మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్ర‌తాప్ సహ నిర్మాత‌, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
 
నటీనటులు:శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, మురళీ శర్మ, బెనర్జీ, పవన్ తేజ్ కొణిదెల..
టెక్నికల్ టీం:దర్శకుడు: తేజ మర్ని
నిర్మాతలు: బన్నీ వాస్, విద్య మాధురి
బ్యానర్: GA2 పిక్చర్స్
సమర్పణ: అల్లు అరవింద్
కో ప్రొడ్యూసర్: భాను ప్రతాప
రైటర్: నాగేంద్ర కాశీ
సినిమాటోగ్రాఫర్: జగదీష్ చీకటి
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి ఎరమల

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments