Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్‌కు నోటీసులు ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:01 IST)
చాలా తక్కువకాలంలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ పేరు ముందు వరుసలో ఉంటుంది. 'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగునాట మాత్రమేకాకుండా కర్ణాటక, చెన్నైలో కూడా విజయ్ దేవరకొండకు అభిమానులు ఉన్నారు. బయట జరిగే పలు ఈవెంట్‌లలో కూడా భిన్నమైన యాటిట్యూడ్, చక్కని ప్రసంగాలతో ఎంతో ఆకట్టుకుంటాడు ఈ నటుడు. తాజాగా విజయ్ అమెజాన్‌పై కేసు వేసి వార్తల్లో నిలిచాడు.
 
విజయ్ దేవరకొండ తనకు సంబంధించి జరిగే ప్రతి ఈవెంట్‌లోనూ తన అభిమానులను రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని పిలుస్తుంటారు. అభిమానులు కూడా విజయ్‌ని రౌడీ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఇక 'రౌడీ' అనే పదం విజయ దేవరకొండ బ్రాండ్‌గా ముద్రపడిపోయింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో రౌడీ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బెంగుళూరులో స్థానికంగా పెద్ద స్థాయిలో దుస్తుల వ్యాపారం మొదలైంది. 
 
ఎంత పాపులర్ అయిందంటే దీని విక్రయాలు అమెజాన్‌లో కూడా సాగుతున్నాయి. ఈ విషయం విజయ్ దృష్టికి రావడంతో బెంగుళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ జరిపిన కోర్టు తాజాగా అమెజాన్ సంస్థకు నోటీసులు జారీ చేసి, ఆ బ్రాండ్ దుస్తుల విక్రయాలను ఆపివేయాలని ఆదేశించింది. ఈ విషయంలో విజయ్‌కు పలు సంస్థల నుండి మద్దతు అందుతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments