అమ్మతోడు.. ఇక తప్పు చేయను.. బ్లేడ్ గణేష్ అని పిలవొద్దు...

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (10:31 IST)
తాను చిన్న తప్పుచేశాననీ, అమ్మతోడు ఇకపై తాను ఎలాంటి తప్పు చేయబోనని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అన్నారు. అందువల్ల తనను ఇకపై బ్లేడ్ గణేష్ అంటూ పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. 
 
ప్రిన్స్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "సరిలేరు నీకెవ్వరు". సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నగరంలో జరిగింది. ఇందులో బండ్ల గణేష్ పాల్గొని ప్రసంగించారు. 
 
రాజకీయాలకు అలా వెళ్లి.. ఇలా వచ్చి.. రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు చెప్పారు. తాను ఇంతకు ముందు సినిమాలు తీసుకున్నప్పుడు.. తన సినిమాని, తన హీరోని ప్రమోట్ చేసుకునే వాడినని బండ్ల చెప్పాడు. కానీ.. ఈ సినిమాకు తనను తాను ప్రమోట్ చేసుకుందామని అనుకుంటున్నానని వ్యాఖ్యానించాడు.
 
తెలుగు చిత్రపరిశ్రమలోకి మూడు దశాబ్దాల క్రితం అడుగుపెట్టినట్టు చెప్పారు. మేనేజర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినట్టు గుర్తుచేశాడు. ఆ తర్వాత నటుడిగా వేషాలేశానని, ఒక స్టార్ దయవల్ల ఒక స్టార్ ప్రొడ్యూసర్‌ను అయ్యానని బండ్ల తన సినీ కెరీర్‌ను గుర్తు చేశాడు. 
 
‘ఈ చిన్న టైం గ్యాప్‌లో తప్పు చేశా.. ఇప్పుడే సుమ చెప్పినట్టు ‘7’ఒ క్లాక్ బ్లేడ్‌తో.. ‘అది నీకు వేస్ట్ రా.. నీకు సినిమానే బెస్ట్ రా.. సినిమాల్లోనే ఉండాలి.. సినిమాల్లోనే జీవితం.. వెర్రి డ్యాష్ అనిపించుకుని నాకు నేనే.. మళ్లీ మీ ముందుకొచ్చాను’ అని బండ్ల ఉద్వేగంతో మాట్లాడాడు. 
 
ఈ సినిమా తర్వాత తననెవరూ ‘బ్లేడ్ గణేష్’ అని పిలవొద్దని బండ్ల గణేష్ కోరడం కొసమెరుపు. పైగా, సరిలేకు నీకెవ్వరు చిత్రంలో పది నిమిషాల పాత్ర ఉందని, అందులే తాను చింపేసినట్టు చెప్పుకొచ్చారు. అమ్మతోడు ఇకపై ఎలాంటి తప్పు చేయబోనని ఒకటికి మూడుసార్లు సభావేదిక ద్వారా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments