Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోక్ష‌జ్ఞ హీరో, నేనే డైరెక్టర్: కొడుకు ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాల‌కృష్ణ‌

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (16:34 IST)
Balakrishna
నంద‌మూరి బాలకృష్ణ  వార‌సుడిగా మోక్ష‌జ్ఞ సినిమా రంగంలోకి రాబోతున్న‌ట్లు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాత కొద్దిరోజుల‌కు మోక్ష‌జ్ఞ‌కు ఇష్టంలేద‌ట‌. అందుకే వార‌సుడిగా రాడ‌ని సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ లోలోప‌ల గ్రౌండ్‌వ‌ర్క్ మాత్రం న‌డుస్తుంద‌నేది తెలిసిందే. ఇంకా ప‌రిప‌క్వ‌త చెంద‌ని ఏజ్‌లో వున్న మోక్ష‌జ్ఞ‌కు ఇప్పుడే ఎంట్రీ కాదంటూ ఆయ‌న అభిమానులు కూడా స‌ర్ది పెట్టుకున్నారు. ఇక నంద‌మూరి అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. మోక్ష‌జ్ఞ ఎట్ట‌కేల‌కు సినిమా ఎంట్రీ ఇస్తున్న‌ట్లు బాలకృష్ణ రిలీవ్ చేశారు.
 
నంద‌మూరి బాల‌కృష్ణ త‌ను పుట్టిన‌రోజున ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌కు ఇచ్చిన జూమ్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న తెలిపారు. మోక్ష‌జ్ఞ ఎంట్రీ అతి చేరువ‌లోనే వుంది. నేను చేసిన `ఆదిత్య 369` సినిమాకు సీక్వెల్ రాబోతుంది. అందులో మోక్ష‌జ్ఞ చేస్తున్నాడు. ఆ సినిమాకు నేనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాను. ప్ర‌స్తుతం మైత్రీ మూవీస్ బేన‌ర్‌లో సినిమా చేస్తున్నాను. ఇదే బేన‌ర్‌లో మోక్ష‌జ్ఞ ఎంట్రీ సినిమా వుంటుంద‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments