Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్ష‌న్ స‌న్నివేశాల్లో బాల‌కృష్ణ సినిమా

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:25 IST)
Nandamuri Balakrishna
నంద‌మూరి బాల‌కృష్ణ తాజా సినిమా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర పోషిస్తోంది. దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు యాక్ష‌న్ పార్ట్ పూర్త‌యింది. ఇది మూడోది. సినిమాలో చాలా కీల‌క‌మైన ఈ పార్ట్‌ను బాల‌కృష్ణ ప్ర‌త్యేకంగా డిజైన్ చేయ‌మ‌ని రామ్ ల‌క్ష్మ‌ణ్‌ల‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది.
 
ఓ య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ద‌ర్శ‌కుడు గోపీచంద్ దీనిని సినిమాటిక్‌గా మార్చి ఓ సందేశాత్మ‌క చిత్రంగా రూపొందించే ప‌నిలో వున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోరాటాలు హైద‌రాబాద్ శివార్లో జ‌రుగుతున్నాయి.
 
ఇందులో బాల‌కృష్ణ రెండే కోణాలున్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే 40 రోజుల‌పాటు షూటింగ్ చేశారు. త్వ‌ర‌లో విదేశాల్లో ఓ కీల‌క షెడ్యూల్ చేయ‌నున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ త‌దుప‌రి సినిమా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments