బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

దేవి
గురువారం, 4 డిశెంబరు 2025 (17:24 IST)
Naga Shaurya, Sridevi Vijay Kumar
హీరో నాగ శౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి, టీజర్ కూడా అద్భుతమైన స్పందన అందుకుంది.  ఈరోజు, సినిమాలోని పొమ్మంటే అనే ఎమోషనల్ పాటను విడుదల చేశారు.
 
హారిస్ జయరాజ్ స్వరపరిచిన పొమ్మంటే, మెలోడీ, ఎమోషన్ ఆకట్టుకుంది. విడిపోవడం వల్ల కలిగే బాధను, తోబుట్టువుల అనుబంధాన్ని అందంగా ప్రజెంట్ చేసింది. రచయిత చంద్రబోస్ మనసుకి హత్తుకునే సాహిత్యం రాశారు, గాయకులు విజయ్ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ తమ వోకల్స్ తో  మరింత హార్ట్ టచ్చింగ్ గా మలిచారు. ఈ పాట  చాలా కాలం పాటు నిలిచిపోతుంది.
 
విజువల్ గా ఈ పాటలో నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ మిస్ అండర్ స్టాండింగ్ ద్వారా విడిపోయిన బ్రదర్, సిస్టర్స్ గా కనిపించారు. వారి అద్భుతమైన పెర్ఫామెన్స్, అజయ్  ప్రజెన్స్ ట్రాక్ ఎమోషన్ ని మరింత పెంచింది.  ఇది తోబుట్టువుల ప్రేమకు మనసుని కదిలించే సాంగ్.
 
రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్ డైరెక్షన్ రామాంజనేయులు నిర్వహిస్తున్నారు.
 
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, నరేష్ VK, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments