Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Advertiesment
Bad Boy Karthik song

చిత్రాసేన్

, బుధవారం, 1 అక్టోబరు 2025 (18:33 IST)
Bad Boy Karthik song
హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ బ్యాడ్ బాయ్ కార్తీక్. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై  శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఫస్ట్ సింగిల్ నా మావ పిల్లనిత్తానన్నాడే సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ అమెరికా నుండి వచ్చాను పాటని రిలీజ్ చేశారు. హారిస్ జయరాజ్ ఈ సాంగ్ ని ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. చంద్రబోస్ రాసిన లిరిక్స్ మాస్ ని ఆకట్టుకోవడంతో పాటు చాలా డెప్త్ మీనింగ్ తో వున్నాయి.
 
చందన బాల కళ్యాణ్, గోల్డ్ దేవరాజ్ వోకల్స్ సాంగ్ లో మరింత ఎనర్జీ నింపాయి. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ కాగ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
 
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్