హీరో నాగ శౌర్య కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్‌లో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. హారిస్ జయరాజ్ రొమాంటిక్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి. సాంగ్ లో నాగ శౌర్య, విధి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ కాగ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, నరేష్ వీకే, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ